Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Key Development In Delhi Cm Rekha Gupta Attack Case

Rekha Gupta Attack: రేఖా గుప్తా హత్యకు ప్లాన్.. సుప్రీంకోర్టు దగ్గర బెడిసికొట్టడంతో..! వెలుగులోకి షాకింగ్ విషయాలు

Published Date :August 25, 2025 , 10:26 am
By Suresh Maddala
  • రేఖా గుప్తా హత్యకు ప్లాన్
  • సుప్రీంకోర్టు దగ్గర దాడికి ప్రణాళిక
  • వెలుగులోకి షాకింగ్ విషయాలు
Rekha Gupta Attack: రేఖా గుప్తా హత్యకు ప్లాన్.. సుప్రీంకోర్టు దగ్గర బెడిసికొట్టడంతో..! వెలుగులోకి షాకింగ్ విషయాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి ప్లాన్ తెలుసుకుని పోలీసులే షాక్‌కు గురయ్యారు. ఇక అంతకంటే ముందే సుప్రీంకోర్టు దగ్గరే భారీ దాడికి ప్లాన్ చేశాడు. సుప్రీంకోర్టు జడ్జిలపై కత్తితో దాడి చేయాలని ప్లాన్ వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కానీ అక్కడ విఫలం కావడంతో ముఖ్యమంత్రి నివాసం దగ్గర అమలు చేశాడు.

ఇది కూడా చదవండి: Houthi-Israel: హౌతీయుల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు.. వీడియోలు వైరల్

ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కత్తితో పొడిచేందుకు నిందితుడు సకారియా ప్లాన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే ముఖ్యమంత్రి నివాసం దగ్గర బాగా క్లౌడ్ ఉండడం.. భద్రతా కూడా ఎక్కువగా ఉండడంతో కత్తిని బయటే పడేసి లోపలికి వెళ్లాడు. అనంతరం వినతిపత్రం ఇస్తూనే రేఖా గుప్తాతో వాగ్వాదానికి దిగి దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా ఆమెను తోసేందుకు ప్రయత్నించగా.. జుట్టు పట్టుకుని లాగేందుకు ప్రయత్నించాడు. బలంగా దాడి చేయడంతో రేఖా గుప్తాకు గాయాలయ్యాయి. ఇంతలోనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే రేఖా గుప్తాను నోటికొచ్చినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: CM Chandrababu: చంద్రబాబు సీరియస్‌ వార్నింగ్..! నిజంగానే వారిపై చర్యలు ఉంటాయా..?

అయితే తొలుత సుప్రీంకోర్టు దగ్గర జడ్జిలపై దాడి చేయాలని సకారియా ప్రణాళిక రచించాడని.. అయితే అక్కడ పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉండడంతో ప్రణాళికను మార్చుకున్నాడని.. అక్కడ నుంచి ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి రేఖా గుప్తాపై దాడి చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.

దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో 8 వారాల్లోగా కుక్కలను తొలగించాలని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీంతో పెద్ద ఎత్తున జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేశారు. సినీ, రాజకీయ ప్రముఖులు నిరసనలు వ్యక్తం చేశారు. తీర్పును సమీక్షించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ గవాయ్‌కు లేఖలు రాశారు. అయితే గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన జంతు ప్రేమికుడు సకారియా తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. వీధి కుక్కలను తొలగించాలన్న తీర్పు రుచించలేదు. దీంతో గుజరాత్ నుంచి ఢిల్లీకి వచ్చి జడ్జిలపై దాడి చేయాలని అనుకున్నాడు. అక్కడ భారీగా సెక్యూరిటీ ఉండడంతో.. అక్కడ నుంచి ముఖ్యమంత్రి రేఖా గుప్తా నివాసానికి వచ్చి దాడి చేశాడు.

ఇక ఈ కేసులో రెండో నిందితుడు సయ్యద్‌ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నిరంతరం సకారియాతో టచ్‌లో ఉన్నట్లుగా కనిపెట్టారు. అంతేకాకుండా డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్లు గుర్తించారు.

సకారియా నేర చరిత్ర..
ఇక ప్రధాన నిందితుడు సకారియాను న్యాయస్థానం ఐదు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. దీంతో అతడి నుంచి అనేక విషయాలను పోలీసులు రాబడుతున్నారు. సకారియా వృత్తిరీత్యా ఆటోరిక్షా డ్రైవర్. 2017 నుంచి 2024 వరకు రాజ్‌కోట్‌లోని భక్తినగర్ పోలీస్ స్టేషన్‌లో ఐదు దాడి కేసులు, మద్యం కేసులతో పాటు పలు కేసులు ఉన్నాయి. గుజరాత్ నిషేధ చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద 2017, 2020, 2022లో రెండు సార్లు చర్యలు కూడా తీసుకున్నారు. 2021లో బాంబే పోలీస్ చట్టంలోని సెక్షన్ 56 కింద సకారియాను బహిష్కరించారు.

ఇక 2017లో సకారియా ఒక వ్యక్తి తలపై బ్యాట్‌తో కొట్టాడు. అంతేకాకుండా 2022లో భార్యతో గొడవ పడి కుటుంబ సభ్యులందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. ఆ సమయంలో బ్లేడ్‌తో తన తలపై దాడి చేసుకోవడంతో తొమ్మిది కుట్లు పడినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడు మొబైల్‌లోని సమాచారం, అతడి స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి మరింత సమాచారాన్ని సేకరించారు.

అవినీతి అంశంపై సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన చేసినట్లే వీధి కుక్కలను తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో నిరసన చేపట్టాలని సకారియా యోచిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇక నిందితుడి మొబైల్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు. ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? లేదంటే దాచి పెట్టాడా? అన్న విషయాలను లోతుగా పరిశీలిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Rekha Gupta
  • Delhi CM
  • key development
  • Rekha Gupta attack case
  • Supreme Court

తాజావార్తలు

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

  • Xiaomi 17 Max: షియోమీ 17 Max లాంచ్ అప్‌డేట్.. 200MP కెమెరా, 8000mAh బ్యాటరీ, అద్భుతమైన స్పెసిఫికేషన్స్

  • SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..

  • Yamaha Ray ZR: యమహా రే జెడ్ఆర్ స్కూటర్ ధర పెంపు.. 125cc FI హైబ్రిడ్ ఇంజన్‌

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions