NTV Telugu Site icon

Brain-eating amoeba: “మెదడును తినే అమీబా” ఇన్ఫెక్షన్‌తో 14 ఏళ్ల బాలుడి మృతి..

Brain Eating Amoeba

Brain Eating Amoeba

Brain-eating amoeba: అత్యంత అరుదైన మెదడును తినే అమీబా ఇన్ఫెక్షన్ కారణంగా మరో బాలుడు మృతి చెందాడు. మే నెల నుంచి కేరళలో నమోదైన మూడో ప్రాణాంతక కేసు. అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్‌తో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల బాలుడు కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు. మృదుల్ అనే బాలుడు బుధవారం రాత్రి 11 గంటలకు మరణించినట్లు కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది.

Read Also: Annamalai: రాజకీయాలకు అన్నామలై విశ్రాంతి.. కారణం ఏంటంటే..

మే తర్వాత కేరళలో ఇది మూడో కేసు. మొదటి కేసు మే 21న మలప్పురానికి చెందిన ఐదేళ్ల బాలిక మృతి చెందగా, రెండవది జూన్ 25న కన్నూర్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. తాజా కేసులో బాలుడు స్థానికంగా ఉన్న చెరువులో స్నానం చేసినట్లు వైద్యారోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. నీటిలో నివసించే అమీబా, స్నానం చేసే సమయంలో లేదా ఆ నీటితో ప్రత్యక్షం కాంటాక్ట్ అయినప్పుడు ఈ అమీబా ముక్కు ద్వారా మెదడుకు చేరే అవకాశం ఉంటుంది. ప్రాణాంతకమైన ఈ ఇన్ఫెక్షన్‌కి సరైన చికిత్స లేదు. దీనికి గురైన వారు మరణించే అవకాశం చాలా ఎక్కువ.