Site icon NTV Telugu

కేర‌ళ‌లో భారీగా పెరిగిన కేసులు… మ‌ర‌ణాలు…

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నా కేర‌ళ రాష్ట్రంలో కేసులు భారీ సంఖ్య‌లో న‌మోదువుతున్నాయి. కేర‌ళ రాష్ట్రంలో 24 గంట‌ల్లో రికార్డ్ స్థాయిలో 51,887 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్టు కేర‌ళ ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో 1205 మంది మృతి చెందారు. కేసులు, మ‌ర‌ణాల సంఖ్య భారీగా పెరగ‌డంతో రాష్ట్ర‌ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయింది. కేర‌ళ‌లో నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు మ‌రింత క‌ఠినంగా నిబంధ‌న‌లు అమ‌లుచేసేందుకు సిద్ద‌మ‌వుతున్నారు.

Read: నావికా ద‌ళానికి భారీగా పెరిగిన కేటాయింపులు…

కేర‌ళ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 60,77,556 క‌రోనా కేసులు న‌మోద‌వ్వ‌గా, ఇందులో 56,53,376 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 3,67,847 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 55,600 మంది మృతి చెందారు. ఎర్నాకులం జిల్లాలో అత్య‌ధికంగా 9,331 క‌రోనా కేసులు న‌మోద‌వ్వ‌గా ఇడుక్కిలో అత్య‌ల్పంగా 2081 కేసులు న‌మోద‌య్యాయి.

Exit mobile version