Site icon NTV Telugu

Kerala: తల్లీ కొడుకులకు ఒకేసారి ప్రభుత్వ కొలువులు

Kerala Mother An Son Got Jobs Together

Kerala Mother An Son Got Jobs Together

Mother and Son To Join Government Service Together: కేరళలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తల్లీ కొడుకులు ఒకేసారి ప్రభుత్వ కొలువులు సాధించారు. ఇద్దరు కలిసి క్లాసులు వెళ్లడం, కలసి చదవడంతో పాటు కలిసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. దీంతో ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. కేరళ మలప్పురానికి చెందిన బిందు (45), ఆమె కొడుకు వివేక్(24) ఇద్దరు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ రాసి ఒకేసారి ఉద్యోగాలను సంపాదించారు.

బిందు తన కొడుకు వివేక్ పదో తరగతిలో ఉన్న సమయంలో కొడుకు చదువును ప్రోత్సహించేందుకు పుస్తకాలు చదవడం ప్రారంభించింది. ఈ అలవాటే బిందును ప్రభుత్వ ఉద్యోగానికి సన్నద్ధం అయ్యేలా ప్రోత్సహించాయి. ఇలా తొమ్మిదేళ్ల తరువాత ఇద్దరూ కలిసి ప్రభుత్వ ఉద్యోగాలను సంపాదించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన లాస్ట్ గ్రేడ్ సర్వెంట్(ఎల్జీఎస్) ఎగ్జామ్ లో బిందు 92వ ర్యాంక్ సాధించగా.. ఆమె కొడుకు వివేక్ లోయర్ డిజిజనల్ క్లర్క్(ఎల్డీసీ) పరీక్షలో 38వ ర్యాంకు సాధించాడు. మూడు ప్రయత్నాల తర్వాత నాలుగో ప్రయత్నంలో ఉద్యోగం సాధించినట్లు బిందు వెల్లడించింది.

Read Also: Jammu Kashmir: కాశ్మీర్ లో ఎదురుకాల్పులు.. రాహుల్ భట్ ను హత్య చేసిన ఉగ్రవాది కోసం వేట

గత పదేళ్లుగా అంగన్వాడీ టీచర్ గా ఉన్న బిందు.. అసలు లక్ష్యం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ సాధించడం తన లక్ష్యం అని చెబుతోంది. తల్లి కొడుకులు ఇద్దరు కలిసి కోచింగ్ తీసుకున్నారు. కోచింగ్ తీసుకునే సమయంలో తమకు టీచర్లు, ఫ్రెండ్స్ తో పాటు తన తండ్రి కూడా ఎంతగానో ప్రోత్సహించాడని వివేక్ తెలిపాడు.

Exit mobile version