Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Kerala Is The Most Poverty Free State

Kerala: ‘అత్యంత పేదరిక రహిత’ రాష్ట్రంగా కేరళ.. ప్రకటించనున్న సీఎం పినరయి

Published Date :October 24, 2025 , 10:43 am
By Suresh Maddala
  • ‘అత్యంత పేదరిక రహిత’ రాష్ట్రంగా కేరళ
  • ప్రకటించనున్న సీఎం పినరయి
Kerala: ‘అత్యంత పేదరిక రహిత’ రాష్ట్రంగా కేరళ.. ప్రకటించనున్న సీఎం పినరయి
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం అనుసరించిన విధానాలు విజయవంతమయ్యాయి. దీంతో ‘‘అత్యంత పేద రహిత రాష్ట్రం’’గా కేరళ అవతరించింది. ఈ మేరకు నవంబర్ 1న కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారికంగా ప్రకటించనున్నారు. సినీ తారలు మమ్ముట్టి, మోహన్ లాల్, కమల్ హాసన్ సమక్షంలో ఈ ప్రకటన చేయనున్నారు.

121

అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన మొదటి భారతీయ రాష్ట్రంగా కేరళ అవతరించిందని మంత్రి ఎంబీ రాజేష్, విద్యా మంత్రి శివన్‌కుట్టి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ చారిత్రక ప్రకటనను తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత పినరయి విజయన్ ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత సతీశన్‌ కూడా హాజరవుతున్నారు.

ఇది కూడా చదవండి: Dubai: దుబాయ్‌లో విషాదం.. 18 ఏళ్ల భారతీయ విద్యార్థి గుండెపోటుతో మృతి

2021లో పేదరిక నిర్మూలన ప్రాజెక్ట్‌ను పినరాయి విజయన్ ప్రభుత్వ చేపట్టింది. మొట్టమొదటిగా ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రతినిధులతో రాష్ట్రమంతా సర్వే చేయించారు. దీంతో 64,006 కుటుంబాలు అత్యంత పేద కుటుంబాలుగా గుర్తింపబడ్డారు. అనంతరం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఉచితంగా నగదు రహిత చికిత్సలు చేపట్టింది. అలాగే పేదలందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించింది. అంతేకాకుండా వాళ్లందరికీ జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టింది. సామాజిక సంక్షేమానికి మద్దతుగా అనేక సహాయ సహకారాలు అందించింది. ఈ కార్యక్రమాలన్నీ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేసింది. దీంతో ఆరోగ్యం, రవాణా, ఆదాయం వంటి కార్యక్రమాలను బహుళ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లింది. దీంతో అన్ని విషయాల్లో సత్‌ఫలితాలు వెలువడ్డాయి.

ఇది కూడా చదవండి: Trump-Israel: అలా చేస్తే మా మద్దతు కోల్పోతారు.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ వార్నింగ్

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ. 80 కోట్లు, 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 50 కోట్లు ఖర్చు చేసింది. దీంతో గృహనిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి ప్రజలకు సంపూర్ణంగా చేరువైంది. దీంతో వారంతా పేదరికాన్ని బయటపడ్డారు. దీంతో పేద రహిత రాష్ట్రంగా కేరళ అవతరించింది.

పురోగతి ఇదే..
3,913 ఇళ్లు నిర్మించారు.
1,338 కుటుంబాలకు భూమి ఇచ్చారు.
5,651 కుటుంబాలకు ఇళ్ల మరమ్మతుల కోసం ఒక్కొక్కరికి రూ.2 లక్షలు అందించారు.
21,263 మందికి రేషన్ కార్డులు, ముఖ్యమైన పత్రాలను అందించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India first free state
  • Kerala
  • Pinarayi Vijayan
  • Poverty free state

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions