కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం అనుసరించిన విధానాలు విజయవంతమయ్యాయి. దీంతో ‘‘అత్యంత పేద రహిత రాష్ట్రం’’గా కేరళ అవతరించింది. ఈ మేరకు నవంబర్ 1న కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారికంగా ప్రకటించనున్నారు. సినీ తారలు మమ్ముట్టి, మోహన్ లాల్, కమల్ హాసన్ సమక్షంలో ఈ ప్రకటన చేయనున్నారు.
అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన మొదటి భారతీయ రాష్ట్రంగా కేరళ అవతరించిందని మంత్రి ఎంబీ రాజేష్, విద్యా మంత్రి శివన్‌కుట్టి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ చారిత్రక ప్రకటనను తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాల తర్వాత పినరయి విజయన్ ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత సతీశన్ కూడా హాజరవుతున్నారు.
ఇది కూడా చదవండి: Dubai: దుబాయ్‌లో విషాదం.. 18 ఏళ్ల భారతీయ విద్యార్థి గుండెపోటుతో మృతి
2021లో పేదరిక నిర్మూలన ప్రాజెక్ట్‌ను పినరాయి విజయన్ ప్రభుత్వ చేపట్టింది. మొట్టమొదటిగా ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రతినిధులతో రాష్ట్రమంతా సర్వే చేయించారు. దీంతో 64,006 కుటుంబాలు అత్యంత పేద కుటుంబాలుగా గుర్తింపబడ్డారు. అనంతరం పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఉచితంగా నగదు రహిత చికిత్సలు చేపట్టింది. అలాగే పేదలందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించింది. అంతేకాకుండా వాళ్లందరికీ జీవనోపాధి కార్యక్రమాలు చేపట్టింది. సామాజిక సంక్షేమానికి మద్దతుగా అనేక సహాయ సహకారాలు అందించింది. ఈ కార్యక్రమాలన్నీ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేసింది. దీంతో ఆరోగ్యం, రవాణా, ఆదాయం వంటి కార్యక్రమాలను బహుళ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లింది. దీంతో అన్ని విషయాల్లో సత్‌ఫలితాలు వెలువడ్డాయి.
ఇది కూడా చదవండి: Trump-Israel: అలా చేస్తే మా మద్దతు కోల్పోతారు.. ఇజ్రాయెల్‌కు ట్రంప్ వార్నింగ్
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ. 80 కోట్లు, 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 50 కోట్లు ఖర్చు చేసింది. దీంతో గృహనిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి ప్రజలకు సంపూర్ణంగా చేరువైంది. దీంతో వారంతా పేదరికాన్ని బయటపడ్డారు. దీంతో పేద రహిత రాష్ట్రంగా కేరళ అవతరించింది.
పురోగతి ఇదే..
3,913 ఇళ్లు నిర్మించారు.
1,338 కుటుంబాలకు భూమి ఇచ్చారు.
5,651 కుటుంబాలకు ఇళ్ల మరమ్మతుల కోసం ఒక్కొక్కరికి రూ.2 లక్షలు అందించారు.
21,263 మందికి రేషన్ కార్డులు, ముఖ్యమైన పత్రాలను అందించారు.
