NTV Telugu Site icon

RSS: ఆర్ఎస్ఎస్‌కి కేరళ హైకోర్ట్ షాక్.. ఆలయంలో ఆయుధ శిక్షణపై నిషేధం..

Rss

Rss

RSS: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ార్ఎస్ఎస్)కి కేరళ హైకోర్టు షాక్ ఇచ్చింది. తిరువనంతపురం జిల్లాలోని శర్కరా దేవీ ఆలయ ప్రాగణంలో ఎలాంటి సామూహిక ఆయుధ శిక్షణకు అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ ఆక్రమం ఆయుధ వినియోగాన్ని నిరోధించేలా ఆదేశించాలని కోరుతూ ఇద్దరు భక్తులు దాఖలు చేసిన పిటిషన్ ని విచారిస్తూ హైకోర్టు ఈ తీర్పు చెప్పింది.

శర్కరా దేవీ ఆలయం ట్రావెన్ కోర్ బోర్డు పరిధిలో ఉంది. బోర్డు నిర్వహించే పుణ్యక్షేత్రాల్లో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించే సామూహిక కసరత్తులను నిషేధిస్తూ, గతంలో ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా పాటించేలా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ‘‘ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్వహణలో ఉన్న ఆలయ ప్రాంగణంలో ఎటువంటి సామూహిక డ్రిల్ లేదా ఆయుధాల అభ్యాసాలు అనుమతించబడవు, చిరయిన్‌కీజు పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు అవసరమైన సహాయం అందించాలి. నిషేధాన్ని కచ్చితంగా పాటించాలి.’’ అంటూ న్యాయమూర్తులు అనిల్ కే నరేంద్రన్, పీజీ అజిత్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Read Also: Nipah virus: నిపా వైరస్ కలకలం.. ఆ రాష్ట్రంలో ఇద్దరు మృతి

కేరళలోని ఆలయాలను నిర్వహించే ట్రావెన్ కోర్ బోర్డు, ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహించే సామూహిక గ్రిల్స్ నిషేధిస్తూ మే 18న ఇచ్చిన ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించాలని అధికారులను కోరుతూ సర్క్యులర్ జారీ చేసింది. 2021 నాటి ఆదేశాలను నిరాకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు సర్య్కూలర్ పేర్కొంది.

ఆలయ సముదాయాల్లో ఆర్‌ఎస్‌ఎస్ చేసే అన్ని రకాల ఆయుధ శిక్షణను నిషేధిస్తూ 2016లో బోర్డు సర్క్యులర్ జారీ చేసింది. తరువాత, మార్చి 30, 2021న దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ బోర్డు సర్క్యులర్‌ను మళ్లీ విడుదల చేసింది. 2016లో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్, కేరళలోని దేవాలయాలను ఆయుధాలకు కేంద్రంగా మార్చేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోందని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.