అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం షాకిచ్చింది. శబరిమల దర్శనంపై పినరయ విజయన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ భక్తులకు మాత్రమే దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తులంతా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Vijayawada Durga Prasadam: దుర్గమ్మ గుడికి వచ్చిన సరుకులను మరోసారి వెనక్కి పంపిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్ ప్రారంభం కానున్న వేళ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రోజుకు గరిష్ఠంగా 80 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చింది. వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలో యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం కల్పించింది. శనివారం సీఎం పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Darshan Case: దర్శన్‌ని భయపెడుతున్న రేణుకాస్వామి ఆత్మ..
దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అటవీ మార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పార్కింగ్ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. శబరిమలకు వెళ్లే మార్గంలో రోడ్లు, దాని చుట్టూ పార్కింగ్ నిర్వహణ పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అతిథి గృహ నిర్మాణం పూర్తయిందని.. త్వరలో మరొకటి పూర్తి కానున్నట్లు అధికారులు వెల్లడించారు