Kerala Couple Wears Messi MBappe Jersey In Their Wedding: ఫిఫా వరల్డ్‌కప్‌కి ముందు వరకూ.. మన భారత్‌లో ఫుట్‌బాల్‌కి ఆదరణ ఉందన్న విషయం పెద్దగా తెలీదు. అప్పుడెప్పుడో ఒకసారి తమని ప్రోత్సాహించమని భారత ఫుట్‌బాల్ స్టార్ సునీల్ ఛేత్రి రిక్వెస్ట్ చేస్తే.. ఆ సమయంలో కొంత సపోర్ట్ అయితే ఇచ్చారు. అంతే, మళ్లీ ఆ క్రీడని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. దీంతో.. ఫుట్‌బాల్‌కి ఇండియాలో ఏమాత్రం లేదని అంతా అనుకున్నారు. కానీ, అది తప్పని ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ చాటి చెప్పింది. లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ పుణ్యమో.. లేక నిజంగానే మనోళ్లకు ఫుట్‌బాల్ అంటే ఇష్టమో తెలీదు కానీ.. ఈ ఫిఫా వరల్డ్‌కప్ మాత్రం భారతీయుల్లోనూ ఫుట్‌బాల్ అభిమానుల్ని వెలికి తీసింది. ఫైనల్ మ్యాచ్‌లో మెస్సీ సారథిగా వ్యవహరిస్తున్న అర్జెంటీనా గెలుపొందినప్పుడు, ఆకాశాన్నంటేలా భారత్‌లో సంబరాలు జరిగాయంటే, ఏ రేంజ్‌లో మనోళ్లకు ఈ ఫుట్‌బాల్ క్రీడ పట్ల అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు.
International Drugs Racket: ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు
కేరళలోని నూతన వధూవరులైతే, అందరికన్నా భిన్నంగా ఫుట్‌బాల్ క్రీడపై తమకున్న అభిమానాన్ని చాటి చెప్పారు. కేరళకు చెందిన సచిన్, అథీరాలకు ఆదివారం పెళ్లి జరిగింది. అదే రోజు ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరగడానికి కొన్ని గంటల ముందే వాళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే.. వీళ్లు పెళ్లి పీటలపై సంప్రదాయ దుస్తులతో పాటు తమతమ అభిమాన ఫుట్‌బాల్ స్టార్ల జెర్సీలు వేసుకోవడం, ఈ పెళ్లి వేడుకలో ప్రత్యేకంగా నిలిచింది. సచిన్‌కి అర్జెంటీనా స్టార్ మెస్సీ అంటే ప్రాణం.. అథీరాకి ఫ్రెంచ్ టీమ్ అంటే ఎంతో ఇష్టం. తమతమ ఇష్టాలకు అనుగుణంగా.. మెస్సీ జెర్సీని సచిన్, ఫ్రెంచ్ స్టార్ ఎంబాపే జెర్సీని అథీరా ధరించి.. పెళ్లి పీటలెక్కారు. అంతటితో ఆగలేదు.. సరిగ్గా మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయానికి తమ వివాహ తంతు, విందు కార్యక్రమం పూర్తయ్యేలా ప్రణాళికలు రచించుకున్నారు. విందు పూర్తవ్వడమే ఆలస్యం.. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు కొత్త దంపతులు కొచ్చి 206 కీలోమీటర్ల దూరంలో ఉన్న వరుడి ఇంటికి చేరుకున్నారు.
Shalini Kidnap Case: సినీ ఫక్కీలో యువతి కిడ్నాప్.. పూజ చేసి బయటకు వస్తుండగా..
తమకు పెళ్లి అయ్యిందన్న సంగతి మర్చిపోయి.. కొత్త దంపతులిద్దరూ టీవీలకు అతుక్కుపోయారు. మొదటి నుంచి చివరివరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ని తిలకించారు. చివరకు అర్జెంటీనా విజయం సాధించిన తర్వాత.. సంబరాలు జరుపుకున్నారు. తన ఫేవరేట్ టీమ్ ఓడినందుకు అథీరా మొదట్లో కాస్త డిజప్పాయింట్ అయినా, తన భర్తకు ఇష్టమైన అర్జెంటీనా గెలిచినందుకు సంతోషంతో పండగ చేసుకుంది. నిజంగా వీళ్ల జోడీ అదుర్స్ కదూ!