LIC: వాటాల విక్రయానికి కేంద్రం నిర్ణయం.. రాష్ట్రాల నుంచి వ్యతిరేకత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎల్‌ఐసీ ఐపీవో ద్వారా 5 శాతం వాటాను విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కేరళ అసెంబ్లీ వ్యతిరేకించింది. ఐపీవోకు వ్యతిరేకంగా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. జాతి అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఎల్‌ఐసీ విషయంలో కేంద్రం పునరాలోచన చేయాలని కోరింది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎల్‌ఐసీని ప్రైవేటీకరించడం లేదని, ఐపీవో ద్వారా ఐదు శాతం వాటాలను మాత్రమే విక్రయిస్తున్నామని ప్రభుత్వం వాదిస్తోందని చెప్పారు విజయన్. ఇది ప్రైవేటీకరణకు తొలి అడుగు అని, ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం కూడా అదేనన్నారు. ప్రైవేటు కంపెనీల దోపిడీ నుంచి పాలసీదారులను రక్షించేందుకే ఎల్‌ఐసీని జాతీయీకరించారని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల వారికి కూడా బీమా చేరువైందంటే అది ఎల్‌ఐసీ చలవేనని అభిప్రాయపడ్డారు. అలాంటిది పార్లమెంట్‌లో ఎలాంటి చర్చా లేకుండా ఎల్‌ఐసీ చట్టంలో కేంద్రం మార్పులు చేసిందని విమర్శించారు కేరళ సీఎం విజయన్.
Read Also: BJP: ధర్నా చౌక్‌లో బీజేపీ దీక్ష.. పోలీసుల అనుమతి..
Also Read
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
- National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
మరోవైపు.. కేంద్ర నిర్ణయంపై ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లాభాల్లో నడిచే ప్రభుత్వ రంగ సంస్థలను తమకు చేతకాదని అమ్మేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద బీమా కంపెనీల్లో ఒకటైన ఎల్‌ఐసీని కేంద్ర ప్రభుత్వం సిగ్గులేకుండా అమ్మేస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. నష్టం వస్తే అమ్మాలి గానీ లాభాలు తెచ్చే సంస్థను భారత ప్రభుత్వం ఎందుకు అమ్మేస్తుందో మోడీ సమాధానం చెప్పాలని నిలదీశారు. అమెరికా బీమా కంపెనీలకు లాభం చేకూర్చేందుకా ఎల్‌ఐసీని అమ్మేస్తున్నారా? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. ఇక, ఎల్‌ఐసీలో 5 శాతం వాటాల విక్రయం కోసం కేంద్రం సెబీకి దరఖాస్తు చేసింది. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవోకు రావాల్సి ఉంది. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తరుణంలో మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. దీంతో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఐపీవో రాక ఆలస్యమవుతోంది.
- Tags
తాజావార్తలు
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
-
Nandana: 10 గంటలు పోలీసుల కస్టడీలో ఉన్నా పెదవి విప్పని నందన?
-
Nivin Pauly: నివిన్ పాలీ సెన్సేషన్.. మోహన్‌లాల్ తర్వాత మొత్తం ఇండస్ట్రీలోనే ఆ రికార్డ్ కొట్టిన ఏకైక హీరో!
-
Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
-
Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!