Site icon NTV Telugu

3 States Elections: 3 రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్

3 States Elections

3 States Elections

కేరళం, పుదుచ్చేరి, అస్సాంలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు మైకులన్నీ మూగబోయాయి. చివరి రోజున మాత్రం అన్ని పార్టీలు హోరా-హోరీగా ప్రచారం నిర్వహించాయి. ఈ మూడు రాష్ట్రాల్లో గురువారం (09-04-2026) పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో కేరళం, పుదుచ్చేరి, అస్సాంలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరుగుతుండగా.. తమిళనాడులో ఏప్రిల్ 23న జరగనున్నాయి ఇక పశ్చిమ బెంగాల్‌లో అయితే రెండు విడతలుగా ఓటింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 23న జరుగుతుండగా.. రెండో విడత పోలింగ్ మాత్రం ఏప్రిల్ 29న జరుగుతోంది. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదలకానున్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఏప్రిల్ 29న సాయంత్రం 6 గంటలకు వెలువడనున్నాయి. అన్ని పార్టీలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: UP: పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు.. బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు

Exit mobile version