Adani: అదానీకి భారీ షాక్.. బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసిన కెన్యా..
- అదానీకి భారీ షాక్..
- బిలియన్ డాలర్ల ఒప్పందాలను రద్దు చేసిన కెన్యా..
- యూఎస్ ఆరోపణల తర్వాత పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adani: అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెన్యా దేశంతో అదానీ గ్రూపుతో చేసుకున్న భారీ ఒప్పందాలను రద్దు చేసుకుంది. కెన్యా రాజధాని నైరోబిలోని జోమో కెన్యాట్టా అంతర్జాతీయ విమానాశ్రయంపై నియంత్రణను అదానీ గ్రూపుకు అప్పగించాలని భావించిన సేకరణ ప్రక్రియను రద్దు చేయాలని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో గురువారం ఆదేశించారు. దాదాపుగా 2 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంలో భాగంగా అదానీ గ్రూప్ కెన్యాట్టలా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రెండో రన్‌వేని ఏర్పాటు చేయవాలి. 30 ఏళ్ల లీజుతో ప్యాసింజర్ టెర్మినల్ అప్‌గ్రేడ్ చేయాలి.
Read Also: Maharashtra Elections: చరిత్ర సృష్టించిన “మహా” ఓటర్లు.. దశాబ్ధం తర్వాత ఎక్కువ ఓటింగ్ శాతం..
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
ఎలక్ట్రిక్ ట్రాన్స్మిషన్ లైన్స్ నిర్మించేందుకు అదానీ గ్రూపుతో ఆ దేశ ఇంధన మంత్రిత్వ శాఖ 30 ఏళ్లకు గానూ 736 మిలియన్ డాలర్ల ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు రూటో తెలిపారు. “రవాణా మంత్రిత్వ శాఖలోని మరియు ఇంధన మరియు పెట్రోలియం మంత్రిత్వ శాఖలోని ఏజన్సీలను నేను ప్రస్తుతం కొనసాగుతున్న ప్రొక్యూర్మెంట్ని వెంటనే రద్దు చేయమని ఆదేశించాను” అని రుటో తన దేశ ప్రసంగంలో తెలిపాడు. పరిశోధన సంస్థలు, భాగస్వామ్య దేశాలు అందించిన సమాచారమే దీనికి కారణమని తెలిపారు. ఈ ఒప్పందాలు చాలా మంది రాజకీయ నాయకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నాయి. ప్రజల నుంచి పారదర్శకత, డబ్బుకు విలువ ఇవ్వడం లేదనే ఆందోళన నేపథ్యంలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
అంతకుముందు, గౌతమ్ అదానీ, మరో ఏడుగురిపై అమెరికా ప్రాసిక్యూటర్ అభియోగాలు మోపారు. భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లను లంచంగా ఇచ్చారని ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఖండించింది. 2023లో హిండెన్‌బర్గ్ రిపోర్టు వచ్చిన తర్వాత కెన్యాలో ఒప్పందాలు రద్దు చేసుకోవాలనే డిమాండ్లు వచ్చినప్పటికీ.. రూటో ఒప్పందాలను సమర్థించారు. తాజాగా ఈ ఒప్పందాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు.
- Tags
- Adani
- Kenya
- US indictment
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!