NTV Telugu Site icon

Amit Shah: ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఆప్ విపత్తు పోతుంది

Amitshah

Amitshah

ఢిల్లీ ఆప్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఫిబ్రవరి 5న ఆప్ విపత్తు పోతుందని జోస్యం చెప్పారు. శనివారం జేఎల్‌ఎన్ స్టేడియంలో జరిగిన ‘‘జుగ్గి బస్తీ ప్రధాన్ సమ్మేళన్‌’’ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని కేజ్రీవాల్ లక్ష్యంగా ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ ఢిల్లీకే కాదు.. ఆయన పార్టీకి కూడా విపత్తేనని పేర్కొ్న్నారు. చెడు రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణాలన్నీ కేజ్రీవాల్‌లో ఉన్నాయని తెలిపారు. దేశంలోనే నెంబర్ వన్ అవినీతి నేత కేజ్రీవాల్ అంటూ అమిత్ షా విమర్శించారు.

ఇది కూడా చదవండి: Game Changer : ‘గేమ్ చేంజ‌ర్‌’ బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ను ఫ్యాన్స్‌తో క‌లిసి జ‌రుపుకున్న రామ్ చ‌ర‌ణ్‌

ఇటీవల ప్రధాని మోడీ నిర్వహించిన సభల్లో కూడా కేజ్రీవాల్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆప్ విపత్తు పోతుందని జోస్యం చెప్పారు. ఇక బీజేపీ నేతలు కూడా కేజ్రీవాల్ లక్ష్యంగా విమర్శల దాడులు చేస్తున్నారు. అంతేకాకుండా కేజ్రీవాల్‌ ధనవంతుడు అంటూ.. ఆయనకు సంబంధించిన పోస్టర్లు వేసి ప్రచారాలు చేస్తున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఆర్ధిక శాఖకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి. ఇక్కడ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీలో ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ, ఆప్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పోటాపోటీగా రెండు పార్టీలు ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆశ పడుతోంది. అయితే ఈసారి ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో చూడాలి.

 

Show comments