Asaduddin Owaisi: బీహార్ పర్యటనలో ఉన్న ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. బీహార్ కిషన్ గంజ్ లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తూ కేసీఆర్ పాలనను పొగిడారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన విలువైన పాలనను అందించారని అన్నారు. బీహార్ సీమాంచల్ ప్రాంతంలో పర్యటన ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు.
Read Also: Patna: పాట్నా రైల్వే స్టేషన్ జుగుప్సాకరమైన సంఘటన.. స్కీన్‌పై పోర్న్ వీడియో ప్లే..
తెలంగాణ లాండ్ లాక్డ్ రాష్ట్రం అని అయినప్పటికీ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిని చాలా బాగుందని, పంపు సెట్ల వినియోగంలో టాప్ ర్యాంకులో ఉందని, మత్స్య సంపదలో దేశంలోనే రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉందని ఆయన అన్నారు. మరోవైపు తన ఎమ్మెల్యేలు నలుగురు ఆర్జేడీలో చేరడంపై సీఎం నితీష్ కుమార్ పై అంతకుముందు రోజు విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ పార్టీని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ చేసేందుకు సీఎం ఇలా చేశారని దుయ్యబట్టారు.
మహరాష్ట్రలో రాజకీయ పరిణామాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు బీహార్ లో మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టినప్పుడు ఏం మాట్లాడలేదని నిందించారు. 2020 బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం 5 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. అయితే వీరిలో ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే తప్పా అంతా లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీలో చేరారు. 2020లో మహాఘటబంధన్ తో పొత్తు పెట్టుకోవాలని మేం అనుకున్నామని, అయితే వారు మమ్మల్ని అవహేళన చేశారని, మేము గతంలో కేవలం 10 స్థానాల్లో పోటీ చేశామని, 2025లో 50 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.