NTV Telugu Site icon

Kashmiri MBBS Student: ఎంబీబీఎస్ విద్యార్థిని ర్యాగింగ్.. సిద్ధరామయ్యకు లేఖ రాసిన జమ్మూ సీఎం

Jammu Cm

Jammu Cm

Kashmiri MBBS Student: కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్‌లో గల అల్-అమీన్ మెడికల్ కాలేజీలో చదువుతున్న కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన సెకండ్ ఇయర్ MBBS విద్యార్థినిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడంతో పాటు దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ సంఘటనచడ జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్పందించింది. ఈ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోక్యం చేసుకోవాలని కోరింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు హమీమ్ అనే విద్యార్థి 2019- 2022 బ్యాచ్‌ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగిందని తెలిపారు.

Read Also: Trump vs INDIA: భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే అమెరికా నష్టపోతుంది..

అయితే, ఒక సీనియర్ హమీమ్‌ను ఆ ప్రాంతం వదిలి వెళ్ళమని ఆదేశించినట్లు జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ కన్వీనర్ నాసిర్ ఖుయేహామి ఆరోపించాడు. అతను ఒప్పుకోకపోవడంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు.. గత సంవత్సరం డైనింగ్ హాల్‌లో ఒక సీనియర్ మెడికల్ విద్యార్థి హమీమ్ తో గొడవ పడ్డాడు అని చెప్పుకొచ్చారు. సీనియర్ల బృందం అతన్ని అవమానించి, ‘అల్-అమీన్ సెల్యూట్’ చేయమని, పాటలు పాడమని, డ్యాన్స్ చేయమంటూ బెదిరింపులకు దిగినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. దానికి అతడు ఒప్పుకోకపోవడంతో సుమారు 8 మంది సీనియర్ విద్యార్థులు హమీమ్ ఉంటున్న హాస్టల్ గదిలోకి చొరబడి దాడి చేసినట్లు చెప్పారు.

Read Also: Shivangi : అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘శివంగి’ ఫస్ట్ లుక్ రిలీజ్

ఇక, ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన గురించి నేను కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో మాట్లాడాను.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.. ర్యాగింగ్ కు పాల్పడిన వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన నాకు హామీ ఇచ్చారు.. ఇప్పటి వరకు నలుగురు నిందితులను గుర్తించారు అని కర్ణాటక సీఎం తనకు చెప్పారని జమ్మూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు