Indo-Pak Clash: పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి జమ్మూ కశ్మీర్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలకు కాశ్మీర్ ప్రధాన కారణమని నోరు పారేసుకున్నారు. అయితే, ఇరు దేశాల మధ్య శాంతిస్థాపన కోసం 2019లో భారత సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేయడంపై కూడా అతడు తన అక్కసు వెళ్లగక్కారు. ఈ విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా చర్యలు తీసుకుందని భారత్‌పై నిందలు వేశారు. ఈ సమస్యకు న్యాయపరమైన పరిష్కారానికి తమ విదేశాంగ విధానం కట్టుబడి ఉందంటూ పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ మళ్లీ పాత పాటే పాడారు.
Read Also: AP Capital Project: అమరావతి రాజధాని కోసం నిధుల సమీకరించుకునే పనిలో సీఆర్డీఏ
మరోవైపు, పాక్ ఉప ప్రధాని ఇషాక్‌దార్ మాట్లాడుతూ.. తమ పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నామన్నారు. ఘర్షణల కంటే దౌత్యాన్నే ఇష్టపడతామంటూ కామెంట్స్ చేశారు. ఇక, ఎవరైనా దురాక్రమణలకు పాల్పడితే గట్టిగా బదులు ఇచ్చేందుకు తమ సాయుధ దళాలు ఎప్పటికీ ముందు వరుసలో ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో సహా పలు ప్రావిన్స్‌లలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
