Site icon NTV Telugu

Shehla Rashid: “కాశ్మీర్ గాజా కాదు”.. ప్రధాని మోదీపై జేఎన్‌యూ మాజీ స్టూడెంట్ లీడర్ ప్రశంసలు..

Shehla Rashid

Shehla Rashid

Shehla Rashid: ఒకప్పుడు ప్రధాని నరేంద్రమోడీని విపరీతంగా వ్యతిరేకించే జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) మాజీ విద్యార్థి నాయకురాలు షెహ్లా రషీద్ ప్రస్తుతం పొగడ్తల వర్షం కురిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితికి ప్రధాని మోడీకి, హోమంత్రి అమిత్ షాలకు థాంక్స్ చెప్పారు. గతంలో తాను కాశ్మీర్ లో రాళ్లు విసిరే వారిపై సానుభూతితో వ్యవహరించానని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని షెహ్లా రషీద్ అన్నారు.

కాశ్మీర్ గాజాతో పోల్చకూడదని అన్నారు. కాశ్మీర్ లో రక్తపాతం లేకుండా ప్రధాని మోడీ ఈ సమస్యను పరిష్కరించారని అన్నారు. ప్రస్తుతం కాశ్మీర్ లోని పరిస్థితులను చూసిన తర్వాత నేను ప్రభుత్వానికి రుణపడి ఉన్నానని ఆమె అన్నారు. కాశ్మీర్ గాజా కాదని, ఎందుకంటే అక్కడ అక్రమ చొరబాట్లు లేవని, తిరుగుబాటు, ఆందోళనలు జరగడం లేదని వెల్లడించారు. ఈ ఉద్రిక్తతలకు మన ప్రభుత్వం పరిష్కారం చూపించిందని అన్నారు. ఈ ఘటన ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్ షాకు దక్కుతుందని అన్నారు.

Read Also: Teacher: 14 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. అరెస్ట్ చేసిన పోలీసులు..

షెహ్లా రషీద్ ఇలా కేంద్ర ప్రభుత్వం, ప్రధానిపై విమర్శలు కురిపించడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది ఆగస్టులో కాశ్మీర్ లో మానవ హక్కుల పరిస్థితిని మెరుగుపరిచినందుకు ప్రధాని నరేంద్రమోడీని ప్రశంసించారు. ఇటీవల ఇజ్రాయిల్-గాజా యుద్ధం సందర్భంగా.. భారతీయురాలిగా పుట్టినందుకు అదృష్టవంతురాలినని, కాశ్మీర్ లో శాంతి కోసం సైన్యం, కాశ్మీర్ పోలీసులు ఎన్నో త్యాగాలు చేశారని కొనియాడారు.

గతంలో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడంపై కేంద్ర ప్రభుత్వాన్ని షెహ్లా రషీద్ విమర్శించారు. జేఎన్‌యూలో విద్యార్థినాయకురాలిగా ఉన్న సమయంలో ఉమర్ ఖలీద్, కన్హయ్య కుమార్ వంటి వారితో భారత్‌కి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, అప్పటి జేఎన్‌యూ కన్హయ్య కుమార్‌పై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ అల్లర్లలో షెహ్లా రషీద్ ప్రమేయం ఉందనే ఆరోపణలతో ఆమెపై కఠినమైన UAPA చట్టం కింద అభియోగాలు నమోదయ్యాయి.

Exit mobile version