Kartik Purnima: నేడు కార్తీక పౌర్ణమి.. అయోధ్య, వారణాసిలతో పాటు దేశవ్యాప్తంగా భక్తుల పుణ్యస్నానాలు
- అయోధ్య, వారణాసిలతో పాటు దేశవ్యాప్తంగా భక్తుల పుణ్యస్నానాలు..
- సరయూ, గంగా నదుల ఘాట్‌ల దగ్గర బారులు తీరిన భక్తులు..
- భక్తుల రద్దీతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kartik Purnima: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలోని సరయూ నదిలోని స్నాన ఘట్టాల దగ్గర భక్తులు పూజలు, పుణ్యస్నానాల కోసం భారీగా బారులు తీరారు. కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలకు దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యకు వచ్చే ఛాన్స్ ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే, యూపీలోని వారణాసిలోనూ పుణ్యస్నానాల కోసం గంగా ఘాట్‌ల దగ్గర భక్తులు బారులు తీరిపోయారు. ఈ రోజు (శుక్రవారం) వారణాసిలో దేవ్ దీపావళి వేడుకలు జరగబోతున్నాయి. వీటిని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వారణాసికి తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రెండు రోజుల పాటు కాశీ విశ్వనాథుని స్పర్శ దర్శనాన్ని అధికారులు పూర్తిగా నిలిపివేశారు.
Read Also: AP Assembly 2024: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు.. రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం!
Also Read
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
- Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
ఇక, సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రజలకు కార్తీక పౌర్ణమి, గురునానక్ దేవ్‌ల జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. ప్రజల అందరికీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు దక్కాలని ఆకాంక్షించారు. ఇక, గురునానక్ తత్వవేత్త, సంఘ సంస్కర్త, కవి, యోగి, దేశ భక్తుడని ఆయన తెలిపారు. సమాజంలోని మూఢ నమ్మకాలు, కులతత్వాన్ని తొలగించేందుకు గురునానక్ తన వంతు కృషి చేశారని అఖిలేష్ యాదవ్ చెప్పుకొచ్చారు.
#WATCH | Uttar Pradesh: A huge crowd of devotees arrive in Varanasi to take holy dip in the Ganga River, on the occasion of Kartik Purnima. pic.twitter.com/dosN2SHqNN
— ANI (@ANI) November 15, 2024
తాజావార్తలు
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు