NTV Telugu Site icon

Kartik Purnima: నేడు కార్తీక పౌర్ణమి.. అయోధ్య, వారణాసిలతో పాటు దేశవ్యాప్తంగా భక్తుల పుణ్యస్నానాలు

Karthiuka

Karthiuka

Kartik Purnima: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలోని సరయూ నదిలోని స్నాన ఘట్టాల దగ్గర భక్తులు పూజలు, పుణ్యస్నానాల కోసం భారీగా బారులు తీరారు. కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలకు దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యకు వచ్చే ఛాన్స్ ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే, యూపీలోని వారణాసిలోనూ పుణ్యస్నానాల కోసం గంగా ఘాట్‌ల దగ్గర భక్తులు బారులు తీరిపోయారు. ఈ రోజు (శుక్రవారం) వారణాసిలో దేవ్‌ దీపావళి వేడుకలు జరగబోతున్నాయి. వీటిని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు వారణాసికి తరలి వస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రెండు రోజుల పాటు కాశీ విశ్వనాథుని స్పర్శ దర్శనాన్ని అధికారులు పూర్తిగా నిలిపివేశారు.

Read Also: AP Assembly 2024: నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు.. రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం!

ఇక, సమాజ్‌ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రజలకు కార్తీక పౌర్ణమి, గురునానక్ దేవ్‌ల జయంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. ప్రజల అందరికీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు దక్కాలని ఆకాంక్షించారు. ఇక, గురునానక్ తత్వవేత్త, సంఘ సంస్కర్త, కవి, యోగి, దేశ భక్తుడని ఆయన తెలిపారు. సమాజంలోని మూఢ నమ్మకాలు, కులతత్వాన్ని తొలగించేందుకు గురునానక్‌ తన వంతు కృషి చేశారని అఖిలేష్ యాదవ్ చెప్పుకొచ్చారు.