NTV Telugu Site icon

Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణపై మూడో ఛార్జ్‌షీట్

Prajwal Revanna

Prajwal Revanna

Prajwal Revanna: హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై నమోదైన అత్యాచారం కేసులో.. సిట్ అధికారులు మూడ‌వ ఛార్జ్‌షీట్ ను దాఖ‌లు చేశారు. జేడీఎస్‌ పార్టీకి చెందిన ఓ మ‌హిళ‌ను తుపాకీతో బెదిరించి ప‌లుమార్లు లైంగింకంగా వేధింపులకు పాల్పడినట్లు ఆ ఛార్జ్‌షీట్‌లో పొందుపర్చింది. 2020 ఫిబ్రవరి నుంచి 2023 డిసెంబర్ వరకు ఓ మ‌హిళ‌పై ప్రజ్వల్ లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పుకొచ్చారు. 1691 పేజీలు ఉన్న ఈ ఛార్జ్‌షీట్ లో 120 మంది సాక్ష్యుల వాంగ్మూలం కూడా తీసుకున్నట్లు చెప్పారు. లైంగిక చర్యకు సంబంధించిన వీడియోలు తీసి, దాంట్లో ముఖం క‌న‌బ‌డ‌కుండా చేసి బెదిరింపుల‌కు పాల్పడినట్లు సిట్ అధికారులు తెలిపారు. వీడియోల ఆధారంగా మ‌ళ్లీ మ‌ళ్లీ ఆ మ‌హిళ‌ను లైంగికంగా వేధించిన‌ట్లు ఛార్జీషీట్‌లో వెల్లడించారు.

Read Also: Vandebharat : ఛత్తీస్‌గఢ్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. కౌన్సిలర్ సోదరుడు సహా ఐదుగురి అరెస్ట్

ఇక, తన కేసు విచారణ గోప్యంగా నిర్వహించాలని కోరుతూ మాజీ పార్లమెంట్ సభ్యుడు ప్రజ్వల్‌ రేవణ్ణ తన న్యాయవాదుల సహకారంతో వేసుకున్న అర్జీని జస్టిస్‌ ఎం.నాగ ప్రసన్న తోసిపుచ్చింది. బాధిత మహిళల విచారణలో గోప్యత పాటించవలసి ఉంటుంది.. కానీ, ప్రజ్వల్‌ విషయంలో విచారణ ఎలా ఉండాలో న్యాయస్థానం తీర్మానిస్తుందని చెప్పుకొచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు పేర్కొనింది.

Show comments