NTV Telugu Site icon

Ram Lalla idol: అయోధ్యలో ప్రతిష్టించబోయే రాముడి విగ్రహం ఎంపిక.. కర్ణాటక శిల్పిని వరించిన అదృష్టం..

Arun Yogiraj’s ‘ram Lalla’ Idol

Arun Yogiraj’s ‘ram Lalla’ Idol

Ram Lalla idol: కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన రామ్ లల్లా విగ్రహాన్ని అయోధ్య రామాలయంలో ప్రతిష్టించనున్నారు. కృష్ణ శిలలతో చెక్కిన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ట కోసం ఎంపిక చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం సోమవారం ధృవీకరించింది. ఈమేరకు ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది. అంతకుముందు రామమందిర ప్రాణ ప్రతిష్ట కోసం అరుణ్ యోగి రాజ్ చెక్కిన విగ్రహాన్ని ఎంపిక చేస్తామని కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప చెప్పారు. తాజాగా టెంపుట్ ట్రస్ ఇదే విషయాన్ని కన్ఫామ్ చేసింది.

Read Also: OTT Movie: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కండంటే?

మైసూరుకి చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రామ్ లల్లా విగ్రహాలను చెక్కడానికి ఎంపిక చేసిన ముగ్గురు శిల్పుల్లో ఒకరు. గతంలో ఆయన కేదార్‌నాథ్‌లో ఉంచిన ఆదిశంకరాచర్యా విగ్రహాన్ని, ఢిల్లీలోని ఇండియా గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను చెక్కారు.

జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతోంది. దీంతో అయోధ్యతో పాటు యావత్ దేశంలో పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. దేశంలోని 7000 మంది ప్రముఖులకు కూడా ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే యోగి సర్కార్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.