Karnataka: ముస్లిం ప్రిన్సిపాల్‌ను తొలగించాలని స్కూల్ వాటర్ ట్యాంకులో విషం..
- ముస్లిం ప్రిన్సిపాల్‌ని తొలగించాలని స్కూల్ వాటర్‌లో విషం..
- కర్ణాటక బెళగావిలో సంచలనంగా మారిన సంఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక బెళగావిలో జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం ప్రిన్సిపాల్‌ని తొలగించేందుకు కొందరు దారుణమైన పని చేశారు. పాఠశాలలోని నీటి ట్యాంక్‌లో విషం కలిపారు. జూలై 14న జరిగిన ఈ సంఘటనలో, శ్రీరామ్ సేన అనే మితవాద గ్రూపుతో అనుబంధం ఉన్న స్థానిక నాయకుడు సహా ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. హులికట్టిలోని ప్రభుత్వ లోయర్ ప్రైమరీ స్కూల్లో గత 13 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ప్రధానోపాధ్యాయుడు సులేమాన్ గోరినాయక్ చుట్టూ భయాందోళనలు, అనుమానాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చర్యతో అతని ప్రతిష్టను దెబ్బతీసి, బలవంతంగా బదిలీ చేయాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
పాఠశాల ట్యాంక్ నుండి నీరు తాగిన తర్వాత పన్నెండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషం ప్రాణాంతకం కాకపోయినా, పాఠశాల అధికారులు, తల్లిదండ్రులలో ఆందోళన కలిగించాయి. పిల్లలకు వెంటనే చికిత్స అందించడంతో ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు. విచారణలో ఐదో తరగతి పిల్లాడు నీటిలో విషం కలిపినట్లు గుర్తించారు. అయితే, పిల్లాడిని విచారించగా, నిందితులు వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ ట్యాంక్‌లో కలపాలని చెప్పినట్లు వెల్లడించాడు. ఆ బాటిల్ ఇచ్చిన వ్యక్తిని కృష్ణ మదార్‌గా గుర్తించారు.
Also Read
- TMC Crisis: మమత బెనర్జీకి మరో ఎదురుదెబ్బ.. కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా..
- Special Trains: సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు..
- CM Vijay: రాజ్యసభ సీటుపై విజయ్ కీలక నిర్ణయం.. కీలక మిత్ర పక్షానికి కేటాయింపు
- Bengal Politics: బెంగాల్ ప్రతిపక్ష నేతగా రీటబ్రత.. మమత పార్టీలో కల్లోలం..
Read Also: Fighter jets: భారత్‌కు 5వ తరం ఫైటర్ జెట్స్ ఎందుకు అవసరం.. అమెరికా F-35, రష్యా su-57లో ఏది బెటర్..
విచారణలో కృష్ణను వేరే నిందితులు బెదిరించినట్లు తేలింది. తన కులాంతర ప్రేమను బయటపెడతారని బెదిరించడంతో తాను ఈ పనిచేశానని, సాగర్ పాటిల్, నాగన గౌడ పాటిల్ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని పోలీసులకు తెలిపాడు. ఒత్తిడికి గురైన కృష్ణ మదార్, పాఠశాల వాటర్ ట్యాంక్‌లో విషం కలపాలనే వారి డిమాండ్‌ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీరామ సేన తాలూకా స్థాయి అధ్యక్షుడు సాగర్ పాటిల్ ఈ ఘటన వెనక మాస్టర్ మైండ్‌గా గుర్తించారు. ప్రిన్సిపాల్‌గా ముస్లిం వ్యక్తి ఉన్నాడనే కోపంతోనే పాటిల్ ఈ పనిచేసినట్లు అంగీకరించాడని పోలీసులు విచారణలో తేలింది. ముగ్గురు నిందితులు – సాగర్ పాటిల్, నాగనగౌడ పాటిల్ మరియు కృష్ణ మదార్‌లను అరెస్ట్ చేశారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషప్రయోగ ప్రయత్నాన్ని ఖండించారు. దీనిని “మతపరమైన ద్వేషం మరియు మౌలికవాదం ద్వారా నడిచే హేయమైన చర్య” అని అభివర్ణిస్తూ, ఈ నేరం మత సామరస్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Test Match: ఆ ప్లేయర్‌కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
-
Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
-
Kitchen Tips: బియ్యంలో పురుగుల నుంచి బిర్యానీ రైస్ వరకు.. వంటగది రూపురేఖలు మార్చే అమేజింగ్ చిట్కాలు!
-
Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
-
Pawan Kalyan: మావిగన్ పేరు వినడానికే చిరాకుగా ఉంది.. పవన్ ఫైర్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!