Site icon NTV Telugu

కర్ణాటకలో మళ్లీ కలకలం రేపుతున్న మంకీ ఫీవర్.. తొలి కేసు నమోదు

కర్ణాటకలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అరుదైన మంకీ ఫీవర్ కేసు బయటపడింది. మంకీ ఫీవర్ అంటే కోతుల నుంచి మనుషులకు సోకే వ్యాధి. ఇది వైరల్ జబ్బు. ఇది సోకిన వారిలో అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి డెంగీ లక్షణాలు ఉంటాయి. దీని కారణంగా 5 నుంచి 10 శాతం మరణం సంభవించే అవకాశాలున్నాయి. వాతావరణంలో మార్పుల వల్లే మంకీ ఫీవర్ వ్యాప్తి చెందుతున్నట్టు పరిశోధనల్లో వెల్లడైంది.

Read Also: ఇండియాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్త కేసులు ఎన్నంటే..?

తాజాగా కర్ణాటకలోని తీర్థహళ్లి మండలంలో 57 ఏళ్ల మహిళకు మంకీ ఫీవర్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఈ ఏడాది మంకీ ఫీవర్ మొదటి కేసు నమోదైందని వారు పేర్కొన్నారు. జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలికి చికిత్స అందిస్తున్నా.. జ్వరం తగ్గకపోవడంతో అనుమానించిన వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం ఆమెకు తీర్థహళ్లి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇదే రాష్ట్రంలోని సాగర్ మండలం, అరళగోడు గ్రామంలో 26 మంది మంకీ జ్వరంతో ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత మళ్లీ మంకీ ఫీవర్ వెలుగు చూడడం ఇదే తొలిసారి.

Exit mobile version