Site icon NTV Telugu

Prajwal Revanna S*x Scandal: ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలను స్టోర్ చేసుకోవద్దు.. ప్రజలకు సిట్ హెచ్చరిక..

Prajwal Revanna

Prajwal Revanna

Prajwal Revanna S*x Scandal: ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ సెక్సు టేపులు కర్ణాటకలో సంచలనంగా మారాయి. కర్ణాటక వ్యాప్తంగా ముఖ్యంగా హసన్ జిల్లాలో ఇవి వైరల్‌గా మారాయి. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు బయటకు వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ ఉదంతంపై కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై రేవణ్ణ ఇంట్లో పనిచేసిన 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్‌తో పాటు ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. మరోవైపు ఓ మహిళను కిడ్నాప్ చేసిన కేసులో సిట్ హెచ్‌డీ రేవణ్ణను అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ దేశం వదిలి జర్మనీ పారిపోయాడు.

Read Also: Priyanka Gandhi: దేశద్రోహులుగా పిలుస్తారని గాంధీ, నెహ్రులు ఊహించలేదు..

బాధిత మహిళల కోసం సిట్ హెల్ప్‌లైన్‌ని ప్రారంభించింది. ఈ వీడియోలు కలిగి ఉన్నవారికి సిట్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజ్వల్, అతని తండ్రి రేవణ్ణలకు సంబంధించిన సెక్స్ టేపులను ప్రజలు ఎవరూ స్టోర్ చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది. ఎవరైనా కలిగి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేసుకోవద్దని కోరింది. ‘‘వీడియోలు, చిత్రాలు మరియు ఆడియో క్లిప్‌లను నిల్వ చేయడం చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలకు దారి తీస్తుంది. కాబట్టి అలాంటి వీడియోలు, చిత్రాలు మరియు ఆడియో క్లిప్‌లను స్టోర్ చేయడం లేదా ప్రసారం చేయకుండా ఉండటానికి ప్రజలు దీని గురించి తెలుసుకోవాలి’’ అని సిట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి వీడియోలు షేర్ చేయడం వల్ల బాధితుల పరువు, గౌరవం దెబ్బతింటాయని సిట్ పేర్కొంది. ఈ వీడియోలను షేర్ చేస్తున్న వ్యక్తులను గుర్తించడం సులువు కాబట్టి, ప్రజలు వారి పరికరాల నుంచి ఈ వీడియోలు, ఆడియోలను తొలగించాలని సూచించింది.

Exit mobile version