Hijab: గతేడాది కర్ణాటక వ్యాప్తంగా హిజాబ్ అంశం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. విద్యాలయాల్లోకి హిజాబ్ లేదా ఇతర మతపరమైన దుస్తులు ధరించి రావడాన్ని కర్ణాటక ప్రభుత్వం బ్యాన్ చేసింది. కర్ణాటక హైకోర్టు కూడా ఇదే అంశాన్ని పేర్కొంది. బీజేపీ ప్రభుత్వం మతపరమైన భావాలను అణిచివేస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.
ఇదిలా ఉంటే పోటీ పరీక్షల సమయంలో విద్యార్థులు హిజాబ్ ధరించడానికి కర్ణాటక ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హిజాబ్ కు అనుమతి ఇవ్వడంతో మరోసారి రాజకీయంగా రచ్చకు తెర లేపినట్లు అయింది. కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్ ఉత్తర్వులు రిలీజ్ చేశారు. దీనిపై నిరసనలకు దిగుతామని హిందూ అనుకూల సంఘాలు బెదిరించాయి. విద్యార్థులు హిజాబ్ ధరించడానికి మంత్రి సుధాకర్ సమర్థించారు. ప్రజలు తమకు నచ్చిన దుస్తులను ధరించడానికి స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. ఇది సెక్యులర్ దేశం, ప్రజలు తమకు నచ్చిన దుస్తులను ధరించే హక్కు ఉందన్నారు.
Read Also: Operation Ajay: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. టెల్ అవీవ్ నుండి ఢిల్లీకి ఇండియన్స్ ..
హిజాబ్ ధరించిన విద్యార్థులు పరీక్ష కేంద్రానికి కనీసం ఒక గంట ముందుగా రావాలని ఆయన సూచించారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయబడుతాడు, ఇది నీట్ ప్రవేశ పరీక్షలో కూడా అనుమతిస్తామని ఆయన చెప్పారు. హిందూ సంఘాల నుంచి వస్తున్న బెదిరింపులపై మాట్లాడుతూ.. ఈ వ్యక్తులు లాజిక్ నాకు అర్థం కాలేదు, ఇది మరొకరి హక్కులను ఒకరు ఉల్లంఘించలేరని, ఇది సెక్యులర్ దేశం అని ఆయన అన్నారు. 2022 జనవరిలో ఉడిపి మహిళా ప్రీయూనివర్సిటీ కళాశాలలో ముస్లిం పాఠశాల విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరైన తర్వాత హిజాబ్ ధరించడం చర్చకు దారి తీసింది.