కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఇప్పటికే సిద్ధరామయ్య- డీకే.శివకుమార్ వర్గాలు రెండుగా విడిపోయాయి. ముఖ్యమంత్రి మార్పును శివకుమార్ వర్గీయులు కోరుకుంటుంటే.. అందుకు సిద్ధరామయ్య ససేమిరా అంటుకున్నారు. సీటులోంచి దిగే ప్రసక్తేలేదని తేల్చి చెబుతున్నారు. ఈ పంచాయితీ ఇలా ఉంటుండగా తాజాగా కొత్త పంచాయితీ రచ్చ చేస్తోంది.
దేశంలో ఓట్ల చోరీ జరుగుతుందంటూ కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఎన్నికల సంఘంపై యుద్ధం చేస్తుంటే.. ఆ పార్టీకి చెందిన నేతలే అదేమీలేదంటూ వ్యతిరేకిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Supreme Courts: కుక్కలను షెల్టర్లకు పంపండి.. ఢిల్లీ అధికారులకు సుప్రీంకోర్టు సీరియస్ ఆదేశం
తాజాగా రాహుల్‌గాంధీ చేసిన ఓట్ల చోరీ ఆరోపణలను కర్ణాటక మంత్రి కేఎన్.రాజన్న బహిరంగంగా ఖండించారు. అలాగేతే ఆ నిందను పార్టీ కూడా పంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఓటర్ల జాబితాను సవరించారన్న విషయం గుర్తించుకోవాలని తెలిపారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కళ్లు మూసుకుందా? అని ప్రశ్నించారు. అక్రమాలు జరుగుతున్నాయన్నది నిజమే.. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఇలా జరగడం అవమానకరం కాదా? అని నిలదీశారు. ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన తర్వాత ఈసీ అభ్యంతరాలు కోరిందని.. అప్పుడు చర్య తీసుకోకపోవడం మన బాధ్యత అవుతుంది కదా? అన్నారు. ముఖ్యంగా మహదేవపుర విషయంలో అనేక అక్రమాలు జరిగాయన్నప్పుడు అప్పుడే అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉండాల్సిందన్నారు. మాట్లాడాల్సినప్పుడు మౌనంగా ఉండి.. ఇప్పుడు దాని గురించి మాట్లాడడం బాగోలేదన్నారు.
ఇది కూడా చదవండి: Asim Munir: భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మూర్ఖపు వ్యాఖ్యలు.. అవసరమైతే…!
ఇక రాజన్న వ్యాఖ్యలను బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. రాహుల్‌గాంధీ కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవాలని కోరింది. సొంత పార్టీ సభ్యులే రాహుల్ ఆరోపణలు అబద్ధమని చెబుతున్నారని పేర్కొంది. దీనిపై త్వరలో ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తామని కర్ణాటక బీజేపీ తెలిపింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందంటూ ఇటీవల బెంగళూరులో రాహుల్ గాంధీ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఒకే పేరున ఉన్న ఓటర్ కార్డులను ఫ్రూప్‌గా చూపించారు. రెండు ఐడీ కార్డులు ఉన్న ఓటర్.. రెండు సార్లు ఓటు వేసినట్లుగా తెలిపారు. అయితే గత లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. తాజాగా రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను సిద్ధరామయ్య సన్నిహితుడు, మంత్రి రాజన్న ఖండించారు.
