NTV Telugu Site icon

Karnataka: కుక్కను తప్పించబోయి చెట్టును ఢీకొట్టిన కారు.. మంత్రికి గాయలు

Car Accident

Car Accident

Karnataka: కర్ణాటక రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు ఈరోజు (జనవరి 14) ఉదయం బెళగావిలో ప్రమాదవశాత్తూ ఓ చెట్టును ఢీకొట్టింది. ఇక ప్రమాద సమయంలో కారులో మంత్రితో పాటు ఆమె సోదరుడు, ఎమ్మెల్సీ చెన్నరాజ్‌ హత్తిహోళి కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదం కారణంగా వీరిద్దరికీ స్వల్ప గాయాలు కాగా, వెంటనే సమీపంలోని హస్పటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read Also: Dilruba Poster: వాలెంటైన్స్‌డే నాడు రాబోతున్న ‘దిల్‌రూబా’

అయితే, ఓ వీధి శునకాన్ని తప్పించబోతుండగా కారు అదుపు తప్పడంతో చెట్టును ఢీకొట్టినట్లు మంత్రి కుమారుడు మృణాల్‌ హెబ్బాళ్కర్‌ వెల్లడించారు. ఈ ప్రమాదంలో మంత్రి ముఖం, వెన్నెముకకు, ఎమ్మెల్సీ చెన్నరాజ్‌ తలకు గాయాలు అయినట్లు చెప్పారు. ప్రస్తుతం వీరికి వైద్యం కొనసాగుతుందని, వారి ఇద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉందని మృణాల్‌ తెలిపాడు. ఇక, ఈ ప్రమాద ఘటనపై బెళగావి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.