కర్ణాటక రాష్ట్రంలో నాయకత్వంలో మార్పు వస్తుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మార్పుపై ఎవరి వాదన వారిదిగా ఉన్నది. కొందరు నాయకత్వంలో మార్పు ఉండబోదని, ఎన్నికల వరకు యడ్యూరప్పనే కొనసాగుతారని చెబుతుండగా, మరికొందరు మాత్రం త్వరలోనే మార్పు ఉంటుందని అంటున్నారు. ఒకవేళ మార్పులు ఉంటే ఎవరికి అవకాశం ఇస్తారు అనే అంశంపై కూడా అనేక మంది అనేక అంచనాలతో ఉన్నారు. రాష్ట్ర పౌర, ఆహార సరఫరాలశాఖ మంత్రి ఉమేశ్‌కత్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ నాయకత్వ మార్పు ఖచ్చితంగా జరిగితే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తనకు దక్కాలని అన్నారు. ఆర్హత పరంగా చూస్తే తాను 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు సార్లు మంత్రిగా పనిచేసినట్టు ఉమేశ్ కత్తి తెలిపారు. అయితే, ఈ ముఖ్యమంత్రి విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అన్నారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాత్రం ఇప్పట్లో నాకత్వం మార్పు ఉండబోదని,కేంద్ర అధిష్టానం హామీ ఇచ్చినట్టుగా ఇటీవల ఢిల్లిలో చెప్పిన సంగతి తెలిసిందే.
Read: దుల్కర్ తర్వాత అఖిల్ తో హను రాఘవపూడి సినిమా