దుల్కర్ తర్వాత అఖిల్ తో హను రాఘవపూడి సినిమా

‘అందాల రాక్షసి’ తో తొలిసారి మెగా ఫోన్ పట్టిన హను రాఘవపూడి ఇంతవరకూ తన ఖాతాలో సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని అయితే వేసుకోలేదు. ఆ తర్వాత నానితో తెరకెక్కించిన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ హిట్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. నితిన్ ‘లై’, శర్వానంద్ ‘పడిపడి లేచే మనసు’ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. అయినా ఫిల్మ్ మేకర్ గా హను రాఘవపూడికి మంచి గుర్తింపే వచ్చింది. ప్రస్తుతం స్వప్న సినిమాస్ బ్యానర్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా వార్ బ్యాక్ డ్రాప్ లో హను రాఘవపూడి ‘లెఫ్టినెంట్ రామ్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీతో బాలీవుడ్ నాయిక, ‘తుఫాన్’ ఫేమ్ మృణాళ్ ఠాకూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. విశేషం ఏమంటే… ఈ సినిమాను కూడా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తీస్తున్నారు.

Read Also : ‘సలార్’ ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ కు సర్వం సిద్ధం!

ఇదిలా ఉంటే… ‘లెఫ్టినెంట్ రామ్’ మూవీ సెట్స్ పై ఉండగానే హను రాఘవపూడి… అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దాని స్టోరీ లైన్ కూ అఖిల్ అంగీకారం తెలిపాడట. ప్రస్తుతం అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ చిత్రంలో నటిస్తున్నాడు అఖిల్. ఈ రెండు సినిమాల తర్వాత ఈ యంగ్ హీరో హను రాఘవపూడి చిత్రానికే కమిట్ అయ్యాడన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారట. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-