Karnataka: కర్ణాటక రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కుణిగల్ పట్టణానికి చెందిన మంజునాథ్ బెంగళూరులోని నాగర్‌భావి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.. ఆ దంపతులకు తొమ్మిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. అయితే, గత కొన్నాళ్లుగా భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండటంతో.. ఈ విభేదాలతో మంజునాథ్ రెండేళ్లుగా విడివిడిగా జీవిస్తున్నాడు.. ఇక, విడాకుల కోసం ఇరువురు కోర్టును ఆశ్రయించారు.
అయితే, గురువారం నాడు విడాకుల పిటిషన్‌ను కోర్టులో ఉపసంహరించుకోవాలని మంజునాథ్ తన భార్యను ఒప్పించేందుకు ఆమె నివాసానికి వెళ్లారు. ఇక, అతని ప్రతిపాదనను భార్య తిరస్కరించడంతో పాటు అతడి వల్ల చాలా బాధలు భరించినట్లు ముఖం మీద చెప్పడంతో.. ఆమె ఉంటున్న ఇంటి కారిడార్ ముందు పెట్రోల్ డబ్బాతో వచ్చి నిప్పంటించుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక, తమ కుమారుడి మృతికి భార్యే కారణమని మంజునాథ్ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై జ్ఞానభారతి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.