Site icon NTV Telugu

Karnataka : ఛీ.. ఛీ.. వీడు అస్సలు మనుషులేనా? మూగ జీవాలను కూడా వదలట్లేదు..

Babygoat

Babygoat

ప్రభుత్వాలు ఎన్ని కొత్త చట్టాలను అమలు చేస్తున్నా కూడా మహిళలపై లైంగిక దాడి జరుగుతూనే ఉంది.. ఇప్పుడు దుర్మార్గులు మూగ జీవాలను కూడా వదిలిపెట్టడం లేదు.. ఒక వ్యక్తి మేకపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి సమీప ప్రాంతం నుంచి మేకను అనుమానస్పదంగా తీసుకెళ్తుండగా చూసిన వ్యక్తి అతడు మేకపై దారుణానికి పాల్పడటం చూసి షాక్ అయ్యాడు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది..

వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని రామనగర జిల్లా చన్నపట్న నగరంలో మేకతో అసహజ శృంగారంలో పాల్పడ్డాడనే ఆరోపణలపై ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. నిందితుడిని ఆటో డ్రైవర్ అయిన రూహిద్‌ అహ్మద్ గా గుర్తించారు.. ఇందిరా కాటేజ్ లేఅవుట్‌లో నివాసం ఉంటున్న నిందితుడు, నిర్మాణంలో ఉన్న భవనం వెనుక మేకను తీసుకెళ్తుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి గుర్తించాడు.. అయితే అతను ఎందుకు అలా తీసుకెళ్తున్నాడో అని వెంబడించాడు..

ఈ క్రమంలోనే నిందితుడు రూహిద్‌ అహ్మద్ మేకతో అసహజ శృంగారం చేయడం, మేకను హింసించడాన్ని గమనించాడు. జమీర్ ఖాన్ తన మొబైల్‌లో ఈ చర్యను రికార్డ్ చేసి నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుతో సంబంధిత అంశం వైరల్ గా మారడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి… పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

Exit mobile version