Karnataka: రామనగర్ జిల్లా పేరు మార్పునకు కేబినెట్ నిర్ణయం.. కొత్త పేరు ఇదే!
- కర్ణాటకలోని రామనగర్ జిల్లా పేరు మార్పునకు కేబినెట్ నిర్ణయం
- త్వరలో కొత్త పేరును ఆమోదించనున్న కేబినెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలోని రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రామనగర్
జిల్లా బెంగళూరు నుంచి 50 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ జిల్లాలో రామనగర, మాగడి, కనకపుర, చన్నపట్న మరియు హారోహళ్లి తాలూకాలు ఉన్నాయి.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్… ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మెమోరాండం సమర్పించడంతో జిల్లా పేరు మార్చాలనే ప్రతిపాదన ఊపందుకుంది. శివకుమార్ రామనగర ఇన్చార్జి మంత్రిగా.. బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కూడా ఉన్నారు. అంతేకాదు శివకుమార్ సొంత జిల్లా రామనగర కావడం విశేషం. గత ఏడాది అక్టోబరులో ఆయన తొలిసారిగా పేరు మార్చాలని ప్రతిపాదించారు.
Also Read
- PM Modi: ప్రధాని మోడీకి మెటా క్షమాపణలు.. సాంకేతిక లోపమే కారణమని స్పష్టీకరణ
- Supreme Court: విద్యార్థి నిరసనకారులకు ఊరట.. మైనర్లు, నేర చరిత్ర లేని వారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
- Parliament Monsoon Session 2026: నేటి నుంచి సజావుగా పార్లమెంట్ సమావేశాలు.. స్పీకర్ ఓం బిర్లా చొరవతో తొలగిన ప్రతిష్టంభన
- Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
రామనగర జిల్లాకు చెందిన నాయకులు డీకే శివకుమార్ నేతృత్వంలో తనను కలిశారని సిద్ధరామయ్య తెలిపారు. మొదటి నుంచి ఈ ప్రాంత ప్రజలు తమను బెంగళూరులో భాగంగా చేయాలని భావించారని.. అందుకే జిల్లాకు బెంగళూరు సౌత్ జిల్లాగా పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలో కేబినెట్ సమావేశంలో ఆమోదిస్తామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
ఇదిలా ఉంటే రామనగరలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఉపయోగించుకునేందుకే ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నారని కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. మళ్లీ ముఖ్యమంత్రి కాగానే ఈ నిర్ణయాన్ని మారుస్తామని వెల్లడించారు. 2007 ఆగస్ట్‌లో రామనగర జిల్లాను విభజించినప్పుడు కుమారస్వామి జేడీయూ, బీజేపీ సంకీర్ణానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కుమారస్వామి వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందిస్తూ.. వారు అధికారంలోకి రావడం భ్రమ అన్నారు.
తాజావార్తలు
-
Allu Arjun: హేటర్స్‌కు అల్లు అర్జున్ స్ట్రాంగ్ మెసేజ్.. ఏం చెప్పాడు భయ్యా!
-
Christopher Nolan: సత్యజిత్ రేకు క్రిస్టోఫర్ నోలన్ నివాళి.. ‘పథేర్ పాంచాలి’ అబ్బురపరిచిందన్న ఆస్కార్ దర్శకుడు!
-
Raaka Movie Update: ‘రాకా’ ఎంట్రీకి రంగం సిద్ధం.. ప్రేక్షకులకు గూస్బంప్స్!
-
Prabhas-Fauji: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించే న్యూస్.. ఈసారి పీక్స్‌లో..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!