దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. దేశంలోని ప్రముఖులకు చెందిన ఫోన్ నెంబర్లు ఇప్పటికే హ్యాకింగ్‌కు గురైనట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా ఇప్పుడు మరో విషయం బయటకు వచ్చింది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, ఆ పార్టీలకు చెందిన నేతల ఫోన్ నెంబర్లపై కూడా నిఘా ఉంచినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి ఇది కూడా ఒక కారణం అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Read: “సర్కారు వారి పాట” లీక్స్ పై మహేష్ అసంతృప్తి
సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండగా అప్పటి డిప్యూటీ సీఎం జీ పరమేశ్వర, కుమారస్వామి, సిద్ధరామయ్య కు చెందిన వ్యక్తిగత కార్యదర్శులకు చెందిన ఫోన్ నెంబర్లపై కూడా నిఘా ఉంచారని అంతర్జాతీయ మీడియా కథనాల్లోపేర్కొన్నది. వీరితో పాటుగా కీలక రాజకీయ నేతలపై కూడా నిఘా ఉంచారని, దీనిద్వారానే రాష్ట్రంలో సంకీర్ణ సర్కార్ కూలిపోయిందనే సందేహాలు కలుగుతున్నాయి.
