రెండోసారి సీఎంకు కరోనా పాజిటివ్.. అస్వస్థత..! ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటికే భారత్‌లో పలువురు ముఖ్యమంత్రులను సైతం పలకరించిపోయింది కరోనా మహమ్మారి.. ఇప్పటికే ఓసారి కరోనాబారిన పడిన కర్ణాటక సీఎం బిఎస్ యడ్యూరప్ప.. మరోసారి ఆ వైరస్‌కు చిక్కాడు.. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో.. ఇవాళ కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది.. ఈ విషయాన్ని కర్ణాటక సీఎంవో ప్రకటించింది.. తీవ్ర జ్వరంతో బాధపడుతూ రామయ్య మెమోరియల్ ఆస్పత్రిలో చేరారు యడ్యూరప్ప.. ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో.. ఇప్పుడు అక్కడి నుంచి మణిపాల్ ఆస్పత్రికి తరలించనున్నారు.
ఇక, ముఖ్యమంత్రి ఇవాళ ఉదయం తన నివాసంలో రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆరోగ్య మంత్రి కె సుధాకర్, బిబిఎంపి కమిషనర్ గౌరవ్ గుప్తా కూడా పాల్గొన్నారు… ఇక, యడ్యూరప్ప.. కోవిడ్ టీకా తొలి డోస్‌ను కూడా మార్చి 12వ తేదీన తీసుకున్నారు.. అయినా ఆయన రెండోసారి కోవిడ్ బారినపడ్డారు.. కాగా, 2020 ఆగస్టులో తొలిసారి ఆయనకు కోవిడ్ సోకింది.. దీంతో.. ఆగస్టు 2 న మణిపాల్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. నెగిటివ్‌గా వచ్చిన తర్వాత ఆగస్టు 10న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా, ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు యడ్యూరప్ప.. గురువారం వరకు ప్రచారంలో ఉన్న ఆయన. గత మూడు రోజులుగా జ్వరం, అలసటతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడు కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో.. తన కుటుంబ సభ్యులు, క్యాబినెట్ సహచరులు, వ్యక్తిగత సిబ్బందితో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న బ్యూరోక్రాట్లు హోం ఐసోలేషన్‌లో ఉండాలని.. వెంటనే కోవిడ్ టెస్ట్‌లు చేయించుకోవాలని సూచించారు సీఎం.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!