Site icon NTV Telugu

Karnataka Politics: తన వర్గం నాయకులు, మద్దతుదారులతో డీకే శివకుమార్ భేటీ..

Dk Shivakumar

Dk Shivakumar

Karnataka Politics: కర్ణాటక రాజకీయ పరిణామాలు సగటు కాంగ్రెస్ అభిమానిని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఫలితాలు వెలువడి మూడు రోజులు కావస్తున్నా.. కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది తేల్చడం లేదు. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యల మధ్య సీఎం పీఠం కోసం పోటీ నెలకొంది. అయితే సిద్దరామయ్య వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు కర్ణాటకలో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ ట్విస్ట్ ఇచ్చింది. ముఖ్యమంత్రిని ఇంకా నిర్ణయించలేదని చెబుతూనే.. 48-72 గంటల్లో కర్ణాటకలో ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేస్తుందని కర్ణాటక కాంగ్రెస్ ఇంఛార్జ్ రణదీప్ సుర్జేవాలా చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: China: చైనాలో ఇంతే.. ఆర్మీపై జోక్ చేసినందుకు భారీ జరిమానా..

ఈ రోజు డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు ఇద్దరు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. అంతకుముందు డీకే, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చాలా సేపు సమావేశం అయ్యారు. ఈ పరిణామాల అనంతరం డీకే శివకుమార్ తన వర్గం నేతలు, నాయకులతో సమావేశం అయ్యారు. శివకుమార్ సోదరుడు ఎంపీ సురేష్ ఇంటిలో ఆయన వీరిందరితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు సాయంత్రం మరోసారి డీకే శివకుమార్, మల్లికార్జున ఖర్గు, రాహుల్ గాంధీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ బంపర్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. 224 స్థానాలకు గానూ కాంగ్రెస్ 135 స్థానాలను దక్కించుకుంది. బీజేపీ 66, జేడీయూ 19 స్థానాలకే పరిమితం అయింది.

Exit mobile version