కల్నల్ సోఫియా ఖురేషిపై మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలు మరువక ముందే.. మరో బీజేపీ నేత.. ఒక ముస్లిం మహిళా ఐఏఎస్ అధికారిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.
ఇది కూడా చదవండి: Allari Naresh : సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో అల్లరి నరేష్..
కలబురగి డిప్యూటీ కమిషనర్ ఫౌజియా తరణమ్ కార్యాలయం దగ్గర బీజేపీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా అక్కడే ఉన్న బీజేపీ శాసనమండలి సభ్యుడు ఎన్.రవికుమార్.. ఆమెను ఉద్దేశించి మతతత్వ వ్యాఖ్యలు చేశారు. కలబురగి డిప్యూటీ కమిషనర్ పాకిస్థాన్ నుంచి వచ్చారా? లేదంటే ఇక్కడి ఐఏఎస్ అధికారియో తనకు తెలియదన్నారు. మీ చప్పట్లు చూస్తుంటే.. డిప్యూటీ కమిషనర్ నిజంగానే పాకిస్థాన్ నుంచి వచ్చినట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: KTR : అమెరికా, లండన్ పర్యటనకు బయలుదేరిన కేటీఆర్
ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ.. బీజేపీ నేత వ్యాఖ్యలు చాలా అసహ్యకరమైనవని తెలిపారు. ఈ విధంగా మాట్లాడే వ్యక్తులు నిజమైన భారతీయులేనా? అని సందేహం కలుగుతుందన్నారు.
ఇక కలబురగి నివాసి ఒకరు.. బీజేపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించడం, మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యంతో చేసిన దురుద్దేశపూరిత చర్యలు మరియు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వ్యక్తులపై దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే ఐఏఎస్ అధికారిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో బీజేపీ నేత రవికుమార్ స్పందించారు. భావోద్వేగంతో అలా మాట్లాడానని.. తమ పార్టీ బాధ్యతాయుతమైన కేంద్ర పాలక పార్టీ అని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని తెలిపారు. తన వ్యాఖ్యలకు ఐఏఎస్ అధికారిని క్షమాపణ కోరుతున్నట్లు చెప్పారు.
ఇటీవల భారత్… పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనికి కల్నల్ సోఫియా ఖురేషి నాయకత్వం వహించారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేశారు. అయితే మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా.. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు.. మన సోదరీమణుల సిందూరాన్ని తుడి చేస్తే.. అదే ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషిని ప్రధాని మోడీ పాకిస్థాన్‌పైకి పంపించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. న్యాయస్థానాలు కూడా మంత్రి వ్యాఖ్యల్ని తప్పపట్టాయి. కోర్టు ఆదేశాలతో మంత్రిపై కేసు నమోదైంది.
