Site icon NTV Telugu

Prajwal Revanna Case: ప్రజ్వల్ రేవణ్ణ జాడ కోసం సీబీఐ సాయం కోరిన కర్ణాటక..

Prajwal Revanna Case

Prajwal Revanna Case

Prajwal Revanna Case: కర్ణాటకలో ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల కుంభకోణం సంచలనంగా మారింది. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడైన ప్రజ్వల్ అభ్యంతరక వీడియోలు ఇటీవల కర్ణాటక వ్యాప్తంగా, ముఖ్యంగా రేవణ్ణ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హసన్ జిల్లాలో వైరల్‌గా మారాయి. ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై వారి ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం బయటకు రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశం వదిలి వెళ్లిపోయాడు. ఈ కేసును విచారించేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

Read Also: Kolikapudi Srinivasa Rao: తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారం

పలువురు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణను కనిపెట్టేందుకు ఇతర దేశాల సాయం కోరాలని కర్ణాటక ప్రభుత్వం సీబీఐ సాయాన్ని కోరింది. బాధితులకు అన్ని విధాలుగా సాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ రోజు సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల ఆరోణలు చేస్తూ ఫిర్యాదు చేసిన మహిళ, 2019 నుంచి 2022 మధ్య కాలంలో తాను పలుమార్లు లైంగిక వేధింపులకు గురయ్యానని ఆరోపించింది. అతను తన కుమార్తెతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించింది.

ఈ కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రజ్వల్‌పై కర్ణాటక లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ రోజు ప్రజ్వల్ ఇంట్లోని సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. ప్రజ్వల్‌‌పై రెండోసారి లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. నిన్న మైసూరులో ఇతడిపై కిడ్నాప్ కేసు నమోదైంది. మరోవైపు ఇది రేవణ్ణ కుటుంబ విషయమని, ఇందులోకి దేవెగౌడను, తనను ఎందుకు లాగుతున్నారని మాజీ సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. విచారణ జరిపి నిందితుడిని శిక్షించాలని కోరారు.

Exit mobile version