NTV Telugu Site icon

Kargil Vijay Diwas 1999: కార్గిల్ విజయ్ దివస్ 25 ఏళ్లు పూర్తి.. అమరవీరులకు రాష్ట్రపతి నివాళులు..!

Murmu

Murmu

Kargil Vijay Diwas 1999: 1999లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన విజయానికి గుర్తుగా కార్గిల్ విజయ్ దివస్‌ను ప్రతి సంవత్సరం జూలై 26వ తేదీన జరుపుకుంటున్నామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఈ సందర్భంగా దేశ సాయుధ బలగాల ధైర్యసాహసాలు, అసామాన్య పరాక్రమాలకు పాల్పడి అమరులైన మన సైనికులకు ఘన నివాళులు అర్పించినట్లు ప్రెసిడెంట్ ముర్ము అన్నారు.

Read Also: Rains Updates: తెలుగు రాష్ట్రాల్లో కొన్నసాగుతున్న వర్షాలు.. రాగల 3 రోజులు భారీ వానలు

ఇక, లడఖ్‌లోని ముఖ్యమైన ప్రాంతాలను దొంగచాటుగా ఆక్రమించిన పాకిస్తాన్ దళాలను వెనక్కి పంపించేందుకు భారత సైన్యం భీకర ప్రతిదాడిని ప్రారంభించింది. 1999లో కార్గిల్ శిఖరాలపై భారతమాతను కాపాడుతూ అత్యున్నత త్యాగం చేసిన ప్రతి సైనికుడికి నేను నివాళులర్పిస్తున్నాను.. వారి పవిత్ర స్మృతికి గౌరవంగా నమస్కరిస్తున్నాను.. వారి త్యాగం, పరాక్రమాన్ని దేశప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.. జై హింద్ జై భరత్! అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పుకొచ్చింది.