Site icon NTV Telugu

Uttar Pradesh: పాఠశాల వద్ద వైన్ షాప్ తొలగించాలని కోర్టుకెక్కిన ఎల్‌కేజీ విద్యార్థి..

High Court

High Court

Uttar Pradesh: పాఠశాల పక్కన ఉన్న మద్యం దుకాణాన్ని ఎత్తేయాలని కోరుతూ ఓ ఎల్‌కేజీ విద్యార్థి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఐదేళ్ల విద్యార్థి పాఠశాల పక్కనే ఉన్న వైన్ షాపును తొలగించానలి కోరుతూ అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించాడు. నాలుగు నెలల న్యాయపోరాటం తర్వాత తీర్పు అతడికి అనుకూలంగా వచ్చింది. పిల్‌ని విచారించిన హైకోర్టు మార్చి 31, 2025 తర్వాత పాఠశాల పక్కనే ఉన్న మద్యం విక్రయ కేంద్రాన్ని పునరుద్ధరించొద్దని కాన్పూర్ ఎక్సైజ్ శాఖను ఆదేశించింది.

కాన్పూర్ ఆజాద్ నగర్‌లో నివిసిస్తున్న ఎల్‌కేజీ విద్యార్తి అర్థవ్ దీక్షిత్ తన న్యాయవాది అశుతోష్ శర్మ ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో నా ఇల్లు, పాఠశాల ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయి, వీటికి దగ్గరగా మద్యం దుకాణం ఉందని, రోజూ మద్యం దుకాణం ముందునుంచే రాకపోకలు సాగించాలని, ఈ సమయంలో మద్యం సేవించిన వ్యక్తులు గుంపులుగుంపులగా ఉండీ గొడవలకు కారణం అవుతున్నారని ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈ దుకాణాన్ని ఇక్కడ నుంచి వేరే చోటుకి మార్చాలని, ఇది పిల్లలపై ప్రతికూల ప్రభావానికి కారణమవుతుందని పేర్కొన్నారు.

Read Also: Lok Sabha elections: కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి మద్దతుగా “ముంబై పేలుళ్ల” నిందితుడు ఇబ్రహీం మూసా ప్రచారం.. ఎవరు ఇతను..?

హైకోర్టులో పిటిషన్ వేయడానికి ముందు, విద్యార్థి అర్థవ్ తన తండ్రి ద్వారా కాన్పూర్ కలెక్టర్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, యూపీ సీఎం పోర్టల్‌కి కూడా ఫిర్యాదు చేశారు. అయితే, 2019లో విద్యార్థి స్కూల్ ప్రారంభం కాగా, గత 30 ఏళ్లుగా అక్కడ మద్యం కాంట్రాక్ట్ నడుస్తోందని చెబుతూ, దానిని తరలించేందుకు ఎక్సైజ్ శాఖ అంగీకరించలేదు. దీని తర్వాత విద్యార్థి తరుపున న్యాయవాది హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై చాలా నెలలుగా అలహాబాద్ హైకోర్టు విచారణ కొనసాగుతోంది. ఇటీవల ఎక్సైజ్ శాఖ వివరణ కోరింది. హైకోర్టు తీర్పునిస్తూ ఇప్పుడు ఈ కాంట్రాక్టును పునరుద్ధరించొద్దని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు న్యాయవాది అశుతోష్ శర్మ తెలిపారు. పాఠశాల పక్కనే కాంట్రాక్టు నడుస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం ఎలా రెన్యూవల్‌ అవుతుందని, అయితే గుడి, ఆస్పత్రి, పాఠశాల పక్కన 50 మీటర్ల పరిధిలో కాంట్రాక్ట్‌ చేయాలనే నిబంధన ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Exit mobile version