అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనతో ఆమె పోస్టును సోషల్ మీడియా నుంచి తొలగించింది. జేపీ నడ్డా సలహాతో పోస్టును తొలగించినట్లు కంగనా రనౌత్ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Covid-19: మళ్లీ కరోనా మహమ్మారి.. సింగపూర్, హాంకాంగ్‌లో వేలల్లో కేసులు..
ప్రస్తుతం ట్రంప్ పశ్చిమాసియాలో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం వచ్చారు. అయితే ఖతార్ రాజధాని దోహాలో జరిగిన వ్యాపార కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌తో మాట్లాడుతూ భారత్‌పై దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతదేశంలో ఆపిల్ కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు. మీరు భారతదేశంలో నిర్మించడం ఇష్టం లేదు. భారతదేశం తమను తాము చూసుకోగలదు. వారు బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే భారత్ ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటి. కాబట్టి భారతదేశంలో అమ్మడం చాలా కష్టం’’ అని టిమ్ కుక్‌తో ట్రంప్ అన్నారు.
ఇది కూడా చదవండి: Miss world 2025: యాదాద్రి, పోచంపల్లి సందర్శించిన అందాల భామలు
ట్రంప్ వ్యాఖ్యలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో కంగనా రనౌత్ విమర్శించారు. ప్రధాని మోడీపై ఉన్న అసూయతోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఆమె అభిప్రాయపడింది. ట్రంప్ రెండోసారి అయితే.. మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చారని.. ఆ అసూయతోనే అలా మాట్లాడి ఉంటారని పేర్కొంది. అయితే నడ్డా సూచనతో ఆ పోస్టును తొలగించేసింది. నడ్డా తొలగించమని చెప్పారని ఎక్స్‌లో పేర్కొన్నారు. వ్యక్తిగత అభిప్రాయాన్ని పోస్ట్ చేసినందుకు చింతిస్తున్నానన్నారు. నడ్డా వ్యక్తిగతంగా ఫోన్ చేశారని కంగనా తెలిపారు.
