Kangana Ranaut: కంగనా రనౌత్‌కి చెంపదెబ్బ.. చండీగఢ్ ఎయిర్‌పోర్టులో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కి చండీగఢ్ ఎయిర్‌పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది కుల్విందర్ కౌర్ కంగనా రనౌత్‌ని చెంపదెబ్బ కొట్టారు. రైతులను అగౌరపరిచారని ఆరోపిస్తూ కంగనాపై సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున గెలుపొందిన కంగనా ఢిల్లీకి వెళ్తే సమయంలో ఈ ఘటన జరిగింది.
Read Also: Kangana Ranaut: కంగనా రనౌత్‌కి చెంపదెబ్బ.. చండీగఢ్ ఎయిర్‌పోర్టులో ఘటన..
Also Read
కంగనా చెప్పిన వివరాల ప్రకారం.. ఆమె UK707 విమానంలో ఢిల్లీకి వెళ్లేందుకు విమానాశ్రయంలోని బోర్డింగ్ పాయింట్‌కి వెళుతుండగా,ఆమెతో కుల్విందర్ కౌర్ వాగ్వాదానికి దిగి తనను కొట్టారని ఆరోపించారు. ఢిల్లీకి చేరుకున్న కంగనా సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులకు జరిగిన సంఘటన వివరించారు. కానిస్టేబుల్, కుల్విందర్‌ను అదుపులోకి తీసుకుని, విచారణ కోసం CISF కమాండెంట్ కార్యాలయానికి తరలించారు.
కంగనా రనౌత్ ఇటీవల బీజేపీ పార్టీ టికెట్‌పై మండి నుంచి పోటీ చేసి గెలుపొందారు. హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ కొడుకు, కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్‌ని ఓడించారు. ఎన్నికల్లో గెలిచిన రెండు రోజులకే ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. గతంలో రైతుల ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ కంగనా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగానే ఆమె దాడి జరిగినట్లు తెలుస్తోంది.
#KanganaRanaut slapped by a CISF constable, Kulwinder Kaur. She was reportedly upset with Kangana's comments on farmers.
Despicable way of expressing ideological differences, especially when you're wearing a uniform! pic.twitter.com/EH4DRqbKJu
— Roop Darak (@RoopDarak) June 6, 2024
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!