KA Paul Sensational Comments On YSR Sonia Gandhi: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సోనియా గాంధీ గతంలో తనను చంపేందుకు ప్రయత్నించారని బాంబ్ పేల్చారు. అయితే.. తనని నాశనం చేద్దామని చూసిన వారు ఇప్పుడు ఎవరూ లేరన్నారు. తాను ప్రజల కోసం దేవుని చేత పంపబడిన దూతని అని పేర్కొన్నారు. దేశం నాశనం కాకూడదని తాను పోరాడుతున్నానన్నారు. తాను అమరావతిని, దేశాన్ని అభివృద్ధి చేయగలనని.. దేశం కోసం, తెలంగాణ కోసం పోరాడుతున్నానని అన్నారు. తనను డబ్బులతో ఎవరూ కొనలేరన్నారు. దేశాన్ని అప్పుల పాలు చేసున్నారు కాబట్టే తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 2010లో తన సోదరుడి హత్య జరిగినప్పుడు తాను అమెరికాలో ఉన్నానని, ఆ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు.
Stock Market Roundup 24-02-23: దేశంలో తొలిసారిగా మునిసిపల్ బాండ్ ఇండెక్స్ ప్రారంభం
జగన్, బాలినేని శ్రీనివాస్ కాలంలో రాజకీయంగా వచ్చానని తనని అరెస్ట్ చేశారని ఆరోపణలు చేశారు. తన సోదరుడి హత్యకు తానే రూ.1 కోటి ఇచ్చానంటూ తనపై తప్పుడు కేసు పెట్టారని, ఆ తర్వాత అది తప్పుడు కేసు అని నిరూపితమైందని చెప్పారు. ఇప్పుడు తనపై తప్పుడు కేసుల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నానని కేఏ పాల్ తెలిపారు. తనని తట్టుకోలేక తనపై ఉన్న పాత కేసుల్ని తిరగదోడుతున్నారన్నారు. తాను కామారెడ్డి రైతులకు న్యాయం చేశానని, దాంతో కేసీఆర్ భయపడి తనని అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లి, పాత కేసులో తనని అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. డిసెంబర్ కల్లా కెసీఆర్ ప్రగతి భవన్‌ను ఖాళీ చేస్తారని జోస్యం చెప్పారు. కనీసం కుక్కల నుంచి ప్రజలను కాపాడలేక పోతున్నారన్నారు. కేవలం కామారెడ్డి కాదు, తెలంగాణ రైతుల పక్షాన తాను నిలబడతానని హామీ ఇచ్చారు. తాను ఐదు లక్షల కోట్లు దానం చేశానన్నారు.
Dried Tomato: మీరెప్పుడైనా డ్రై టమాటాల గురించి విన్నారా..?
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని, అప్పు చేసిన ఐదు లక్షల కోట్లు ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో ఒక కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున కేసీఆర్ నష్టం తెచ్చారన్నారు. తెలంగాణ, రైతు, అమరవీరుల ద్రోహి కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్లుగా మారుతారని కేసీఆర్‌కి అవకాశం ఇచ్చారని, కానీ ఇంకా మారలేదని అన్నారు. తనపై ఉన్న తప్పుడు కేసుల విషయంలో తన అడ్వొకేట్లు అమ్ముడు పోతున్నారన్న ఆయన.. తానే నేనే అడ్వొకేట్ అవుతున్నానన్నారు. సుప్రీంకోర్టులో తాను మూడు కేసులు ఫైల్ చేసున్నానని చెప్పిన కేఏ పాల్.. కేసీఆర్ కుటుంబానికి హృదయ శుద్ధి లేదని విమర్శించారు. తెలంగాణ, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం మాత్రమే తానను రాజకీయాల్లోకి వచ్చానని మరోసారి స్పష్టం చేశారు. కేసీఆర్ కళ్లు మూసుకుని మందు తాగుతున్నాడని, రాజశేఖర్‌కి పట్టిన గతే కేసీఆర్‌కి పడుతుందని కేఏ పాల్ వెల్లడించారు.