NTV Telugu Site icon

KA Paul: ట్రంప్ అరెస్ట్ అవుతాడని గతంలోనే చెప్పాను.. కేఏ పాల్ హాట్ కామెంట్స్

Ka Paul On Trump

Ka Paul On Trump

KA Paul Controversial Comments On Donald Trump And CM KCR: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ కామెంట్స్‌తో వార్తల్లోకెక్కారు. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అరెస్ట్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. ట్రంప్ అరెస్ట్ అవుతాడని తాను గతంలోనే చెప్పానంటూ బాంబ్ పేల్చారు. ట్రంప్ మారాలని ఎన్నోసార్లు హెచ్చరించానని, కానీ అతడు వినిపించుకోలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ మీద కూడా తాను ఆరు కేసులు గెలిచానన్న ఆయన.. ఇంకా సీఎంపై కేసులున్నాయని, తాను ఓడిపోలేదని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తాను పగలనక రాత్రనక తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నానన్నారు. సిరిసిల్లలో తనపై దాడి చేసిన వారి మీద ఇప్పటివరకు అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనిల్ కుమార్ సైతం తనపై హత్యాయత్నం చేశారని, అతనిపై పోలీసులు ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

Clash: ‘బలగం’ సినిమా ప్రదర్శన వద్ద యువకుల ఘర్షణ.. ఓ వ్యక్తి దుర్మరణం

తెలంగాణలో తాను ఏ కార్యక్రమాన్ని చేపట్టాలన్నా అడ్డుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం తనపై లేనిపోని కేసులు పెడుతోందని కేఏ పాల్ ఆరోపించారు. తనని చంపించాలని చాలామంది చూస్తున్నారంటూ కుండబద్దలు కొట్టారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ సెక్రటేరియట్ ఓపెన్ చేయాలని ఈ సందర్భంగా ఆయన కేసీఆర్‌కి డిమాండ్ చేశారు. చాలామంది బిలియనీర్లు హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ.. లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని, రాష్ట్రాన్నీ శ్రీలంకలా తయారు చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల కోసం.. రైతులు, బడుగు బలహీన వర్గాల కోసం తాను ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజాశాంతి పార్టీని రెండు తెలుగు రాష్ట్రాలలో గెలిపించాలని ప్రజల్ని కోరారు. కేజ్రీవాల్‌ని ఢిల్లీలో, పంజాబ్‌లో ఎలా ఎన్నుకున్నారో.. తనని కూడా తెలుగు రాష్ట్రాల్లో అలాగే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్ని తానొక్కడే మార్చగలనని చెప్పుకొచ్చారు.

Nandini vs Amul: కర్ణాటకలో అమూల్ రగడ.. పాల ఉత్పత్తులను విసిరి నిరసన

ఇదిలావుండగా.. కేఏ పాల్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఇటీవల తెలంగాణ నూతన సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సచివాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని, నరబలి అని కేఏ పాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన కేసులో తానే స్వయంగా వాదనలు వినిపించారు. ఈ పిటిషిన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. అగ్నిప్రమాద ఘటనలపై జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పేసింది. అంతేకాదు.. దేశంలో జరిగే అగ్నిప్రమాదాలపై సీబీఐతో విచారణ జరపమని ఆదేశించాలా? అంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కేఏ పాల్ పిటిషన్‌ని తోసిపుచ్చింది.