NTV Telugu Site icon

K Annamalai: ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలి..

Annamalai

Annamalai

K Annamalai: తమిళనాడు రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ కె ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై డిమాండ్ చేశారు. విచారణ చేసేందుకు కేంద్ర ఏజెన్సీకి ఎందుకు అప్పగించడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సిద్ధంగా లేరని ప్రశ్నించారు. ప్రస్తుత సీఎం ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతిదానికీ (71) సీబీఐ విచారణకు డిమాండ్ చేసేవారు.. కానీ, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క కేసును కూడా సీబీఐకి ఇవ్వలేదన్నారు. హత్యకు గురైన బీఎస్పీ నేత కుటుంబాన్ని సోమవారం కలిసిన అనంతరం అన్నామలై ఈ కామెంట్స్ చేశారు. తమిళనాడు పోలీసు రాష్ట్రంగా మారిందని ఆరోపించారు.

Read Also: Vanangaan Trailer : అదరగొట్టిన బాలా.. ట్రైలర్..భళా..

ఇక, తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని హత మార్చిన ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేయకపోవడం దారుణమని అన్నామలై పేర్కొన్నారు. మాయావతి చెప్పినట్లుగా తమిళనాడులో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి.. దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు..? అని ప్రశ్నించారు. అయితే, జులై 5న హత్య జరిగిన రోజు రాత్రి లొంగిపోయిన ఎనిమిది మంది వ్యక్తులను తమిళనాడు పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయడంతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. పాత శత్రుత్వమే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు. కానీ, పోలీసులు డిఫెన్సివ్ మోడ్ లో ఉన్నారని కె టీఎన్ చీఫ్ బీజేపీ చీఫ్ అన్నామలై పేర్కొన్నారు.