ఈ ప్రకృతిలో తల్లి, బిడ్డల ప్రేమ వర్ణించలేనిది. జంతువుల్లోనైనా.. మానవ జాతిలోనైనా పేగు బంధం అపురూపమైనది. ఇది మాటల్లో వర్ణించలేనిది. ఈ సృష్టిలో అంత అద్భుతమైంది ఈ బంధం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: Delhi Cloud Seeding: ఢిల్లీలో మేఘ మథనం ఫెయిల్.. కోట్లు కుమ్మరించినా పడని వాన చుక్క
అది ఢిల్లీ హైకోర్టు. న్యాయమూర్తి.. జస్టిస్ తారా వితాస్తా గంజు. కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. దీంతో బార్ అసోసియేషన్ గ్రాండ్‌గా వీడ్కోలు కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ గంజు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ గంజు వీడ్కోలు ప్రసంగం చేస్తూ.. ‘‘నా కుటుంబానికి నేను చాలా కృతజ్ఞత చెప్పాలి. నా తల్లి, నా కుమార్తె ఇక్కడ ఉన్నారు. నిరంతరం వారు నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చారు.’’ అని అనగానే కుమార్తెకు కన్నీళ్లు ఉబికి వచ్చాయి. సడన్‌గా చూడగానే కుమార్తె భావోద్వేగానికి గురై ఏడుస్తూ కనిపించింది. ‘‘నువ్వు ఏడిస్తే.. నేను కూడా ఏడ్చేస్తాను’’ అని గంజు అన్నారు. కొద్దిసేపు గంజు కూడా భావోద్వేగానికి గురయ్యారు. కాసేపటికి నిగ్రహించుకుని ప్రసంగం కొనసాగించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Trump Dance: జపాన్‌లోనూ మరోసారి డ్యాన్స్‌తో అదరగొట్టిన ట్రంప్.. వీడియో వైరల్
జస్టిస్ గంజు.. మే 2022లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. వీడియాతో గంజు మాట్లాడుతూ.. తాను ఇంత స్వేచ్ఛగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానంటే కుటుంబ సభ్యులు ఇచ్చిన తోడ్పాటు అన్నారు. తనపై ఎటువంటి ఫిర్యాదు లేకుండా అన్ని విషయాల్లో అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. విధులను నిజాయితీగా నిర్వర్తించడాకిని తనకు మనశ్శాంతిని ఇచ్చారని గంజు తెలిపారు. ఇక బార్ అసోసియేషన్ సభ్యులు కూడా పూర్తిగా సహకరించారని.. వారికి కృతజ్ఞతలు చెప్పారు.