JPC First Meeting: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జమిలి ఎన్నికల బిల్లు అధ్యయనంపై వేసిన జేపీసీ తొలి సమావేశం జనవరి 8వ తేదీన జరగనుంది. ఢిల్లీలోని పార్లమెంట్ అపెక్స్ బిల్డింగ్ లో ఉదయం 11గంటలకు భేటీ కానుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు-2024ను పార్లమెంట్ లభించింది. అయితే, ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఈ బిల్లుపై విస్తృత అధ్యయనం కోసం జేపీసీని ఏర్పాటు చేయగా.. అందులో లోక్ సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలు ఉన్నారు. ఈ జేపీసీ కమిటీ చైర్మన్ గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరిని స్పీకర్ ఓంబిర్లా నియమించారు. సభ్యులుగా అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, మనీశ్ తివారీ, ప్రియాంక గాంధీ తదితరులు ఉన్నారు.
Read Also: Vijaysai Reddy: ఏ కూటమిలో చేరే ఆలోచన మాకు లేదు.. మాది న్యూట్రల్ స్టాండ్!
అయితే, జేపీసీలో బీజేపీ నుంచి 16 మంది ఉండగా.. కాంగ్రెస్ నుంచి ఐదుగురుకి కేంద్రం ఛాన్స్ ఇచ్చింది. అలాగే సమాజ్ వాది పార్టీ (2), టీఎంసీ (2), డీఎంకే(2), వైసీపీ(1), శివసేన(1), టీడీపీ(1), జేడీయూ(1), ఆర్ఎల్డీ(1), ఎల్బీఎస్పీ- ఆర్వీ(1), జేఎస్పీ(1), శివసేన(యూబీటీ)(1), ఎన్సీపీ-(ఎస్పీ)(1), సీపీఎం(1), ఆప్(1)కి సైతం స్థానం కల్పించారు. ఇక, ఎన్డీయే నుంచి 22 మంది, విపక్ష ఇండియా బ్లాక్ నుంచి 10 మంది జేపీసీలో చోటు దక్కించుకున్నారు. పార్లమెంట్ ఉభయ సభలో ప్రవేశ పెట్టిన తీర్మానం ప్రకారం జేపీసీ తన నివేదికను 2025లో జరిగే పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ ల్లోని మొదటి రోజు లోక్ సభలో సమర్పించాల్సి ఉంటుంది.