NTV Telugu Site icon

JP Nadda: తెలంగాణలో కేసీఆర్ పాలన పోవడం, బీజేపీ రావడం ఖాయం

Jp Nadda

Jp Nadda

తెలంగాణలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. తెలంగాణలో కేసీఆర్ పాలన పోవడం, బీజేపీ పాలన రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఇంట్లో కూర్చోబెట్టాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు బీజేపీకి కొత్త బలాన్ని ఇచ్చారని తెలిపారు. రఘునందన్‌, ఈటల విజయం.. భాజపా అధికారంలోకి వస్తుందనేందుకు సూచన అని ఆయన అన్నారు.

Kishan Reddy : మీ నుండి బాప్-బేటా పాలన నేర్చుకోవాలా

కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంలా మార్చుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ కారులో కేసీఆర్ కుటుంబానికి తప్ప ఇతరులకు చోటు లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని నడ్డా ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ వస్తుందని భావిస్తున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారన్నారు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తీరతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలన్నారు. కేసీఆర్‌ అవినీతి, అక్రమాలు చూసి ప్రజలు విసిగిపోయారని విమర్శలు గుప్పించారు. ప్రియతమ నేత మోదీని చూసేందుకు ఇంత మంది పోటెత్తారని సభకు వచ్చిన జనాలను ఉద్దేశించి హర్షం వ్యక్తం చేశారు.