NTV Telugu Site icon

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై ‘‘జేపీసీ’’.. 31 మంది సభ్యులు.. లిస్ట్ ఇదే..

Waqf Bill

Waqf Bill

Waqf Bill: వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలకు కత్తెర వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లుని తీసుకువచ్చింది. అయితే, ఈ బిల్లను కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు వ్యతిరేకించి సభలో ఆందోళన చేశాయి. ఈ బిల్లు రాజ్యాంగంపై దాడిగా, మత స్వేచ్ఛను హరించేలా ఉందని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బిల్లుపై ‘‘జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ని ఏర్పాటు చేసింది.

కమిటీలో మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు. ఇందులో 21 మంది లోక్‌సభ ఎంపీలు, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉండనున్నారు. తరుపది సమావేశాల్లో కమిటీ తమ నివేదికను సభకు సమర్పించాల్సి ఉంటుంది. లోక్‌సభ నుంచి సభ్యులుగా ఎన్నికైన వారిలో 12 మంది అధికార బీజేపీ కూటమి అయిన ఎన్డీయే నుంచి ఉన్నారు. ఇందులో బీజేపీ నుంచి 08 మంది, ప్రతిపక్షం నుంచి 09 మంది ఉన్నారు. రాజ్యసభ నుంచి బీజేపీకి చెందిన నలుగురు, కాంగ్రెస్ కూటమికి చెందిన ఎంపీలు నలుగురితో పాటు ఒక నామినేటెడ్ సభ్యుడు ఉన్నారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా త్వరలోనే కమిటీకి అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నారు. బీజేపీకి చెందిన జగదాంబికా పాల్ అధ్యక్షత వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also: Mamata Banerjee: డాక్టర్ హత్యపై సీఎం కీలక వ్యాఖ్యలు.. అవసరమైతే నిందితుల్ని ఉరితీస్తామని ప్రకటన

లోక్‌సభ నుంచి సభ్యులు-వారి పార్టీలు:

బీజేపీ నుంచి: జగదాంబిక పాల్, నిషికాంత్ దూబే, తేజస్వి సూర్య, అపరాజిత సారంగి, సంజయ్ జైస్వాల్, దిలీప్ సైకియా, అభిత్ గంగోపాధ్యాయ, DK అరుణ

కాంగ్రెస్ నుంచి: గౌరవ్ గొగోయ్, ఇమ్రాన్ మసూద్, మొహమ్మద్ జావేద్

సమాజ్ వాదీ పార్టీ: మొహిబుల్లా

తృణమూల్ కాంగ్రెస్: కళ్యాణ్ బెనర్జీ

డీఎంకే: ఏ రాజా

టీడీపీ: లావు శ్రీకృష్ణ దేవరాయలు

జేడీయూ: దిలేశ్వర్ కమైత్

శివసేన (యూబీటీ): అరవింద్ సావంత్

ఎన్సీపీ(శరద్ పవార్): సురేష్ మాత్రే

శివసేన: నరేష్ మాస్కే

ఎల్జేపీ-రామ్ విలాస్: అరుణ్ భారతి

ఎంఐఎం: అసదుద్దీన్ ఓవైసీ

రాజ్యసభ సభ్యులు:

బీజేపీ : బ్రిజ్ లాల్, మేధా విశ్రమ్ కులకర్ణి, గులాం అలీ, రాధా మోహన్ దాస్ అగర్వాల్

కాంగ్రెస్: సయ్యద్ నసీర్ హుస్సేన్

టీఎంసీ: మహ్మద్ నడిముల్ హక్

వైఎస్సార్సీపీ: విజయసాయి రెడ్డి

డీఎంకే : మహ్మద్ అబ్దుల్లా

ఆప్: సంజయ్ సింగ్

నామినేటెడ్ సభ్యుడు: ధర్మస్థల వీరేంద్ర హెగ్డే

Show comments