Jodhpur University: యూనివర్సిటీ నిర్వాకం.. 100కి 123 మార్కులు.. మెమో చూసుకుని విద్యార్థులు ఆశ్చర్యం
- జోధ్‌పూర్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ నిర్వాకం
- 100కి 123 మార్కులు.. మెమో చూసుకుని విద్యార్థులు ఆశ్చర్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం నిర్వాకం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విద్యార్థులతో సహా విద్యావేత్తలను విభ్రాంతికి గురి చేసింది. మార్కుల మెమోలో 100 మార్కులకు గాను 123 మార్కులు వేయడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు.

Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
జోధ్‌పురిలోని ఎంబీఎం ఇంజనీరింగ్ యూనివర్సిటీలో 100 మార్కులకు రెండవ సెమిస్టర్ జరిగింది. అయితే మార్కుల మెమోలో 100 మార్కులకు గాను ఒకచోట 123 మార్కులు.. ఇంకొక చోట 119 మార్కులు వచ్చాయి. దీంతో విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు. దీనిపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వాన్ని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Pawan Singh: బీజేపీలో చేరిక గాయకుడు పవన్ సింగ్.. బీహార్‌లో పోటీ కోసమేనా?
విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో ఉంచిన ఫలితాలను చూసి విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అనేక మంది విద్యార్థులకు ఇలాంటి పొరపాట్లు కనిపించాయి. అయితే దీనిపై గందరగోళం నెలకొనగానే పరిపాలన విభాగం ఎలాంటి వివరణ ఇవ్వకుండానే తొలగించే ప్రయత్నం చేసింది. ఈ వ్యవహారం విమర్శలకు దారి తీసింది. అయితే విశ్వవిద్యాలయంలో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదని సమాచారం. గతంలో కూడా ఇలా పలుమార్లు జరిగినట్లు తెలుస్తోంది. చాలా సార్లు సర్టిఫికెట్లు దిద్దుబాట్లు చేసిన దాఖలాలు చాలానే ఉన్నట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Pakistan: పోలీస్ శిక్షణా కేంద్రంపై ఆత్మాహుతి దాడి.. ఆరుగురు పోలీసులు.. ఏడుగురు ఉగ్రవాదులు మృతి
ఫలితాలను వైట్‌సైట్‌లో విడుదల చేసే ముందు చూసుకోకుండా ఎలా విడుదల చేస్తారని ఒక విద్యార్థి యూనివర్సిటీ పరిపాలన విభాగాన్ని ప్రశ్నించాడు. అంతర్గత మార్కులను అంతర్గతేతర మార్కులతో పాటు తప్పుగా అప్‌లోడ్ చేశారని ఆరోపించాడు. తప్పు పూర్తిగా పరిపాలనాపరమైనదే అయినప్పటికీ చాలా మంది విద్యార్థులు సరిదిద్దు కోవడానికి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోయాడు.
జరిగిన పొరపాటును వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ అజయ్ శర్మ తప్పును అంగీకరించారు. పరీక్షా సంస్థ తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు అంతర్గత మార్కులు 15-20 నిమిషాల పాటు అనుకోకుండా అప్‌లోడ్ అయ్యాయని పేర్కొన్నారు. లోపం గుర్తించిన వెంటనే ఫలితాలు తొలగించినట్లు చెప్పారు. బాధ్యతాయుతమైన ఏజెన్సీకి నోటీసు జారీ చేశామన్నారు.
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!