Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!

  • బారాముల్లా జిల్లాలో రెవెన్యూ శాఖ బుల్డోజర్ యాక్షన్
  • సోపోర్‌లో ప్రభుత్వ భూమిలో నిర్మించిన షెడ్ కూల్చివేత
  • పార్లమెంట్ దాడి దోషి అఫ్జల్ గురు బంధువుల ఇళ్లుగా గుర్తింపు
Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాది మహ్మద్ అఫ్జల్ గురు ఫ్యామిలీకి చెందిన ఇంటిని జమ్మూ కాశ్మీర్ అధికారులు మంగళవారం బుల్డోజర్లతో కూల్చేశారు. బారాముల్లా జిల్లాలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా షెడ్డును కూల్చేసినట్లు అధికారులు తెలిపారు. సోపోర్ ప్రాంతంలో వరద ప్రభావిత భూమిలో ఈ షెడ్డు నిర్మించారు

అఫ్జల్ గురు ఫ్యామిలీకి చెందిన సభ్యులు ఈ నిర్మాణాన్ని నిర్మించి అందులో నివాసం ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూమిలో నిబంధనల్ని ఉల్లంఘించినట్లు పేర్కొంటూ రెవెన్యూ అధికారులు ఈ నిర్మాణాన్ని కూల్చేశారు. 2001 పార్లమెంట్ దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు 2013లో ఉరిశిక్ష విధించారు. ఇతడికి జైషే మహ్మద్ ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నాయి. 2002లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించగా, 2013లో అమలు చేశారు.